
సన్‌రైజర్స్‌లోకి డికాక్
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాకు ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడనున్నాడని సమాచారం. మంచి ఓపెనింగ్ బ్యాటర్‌తోపాటు వికెట్ కీపర్ అయినా డికాక్‌ను ఈ సారి మెగా వేలంలో కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయించుకుందట. డబ్బులు ఎన్నైనా సరే వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మ్యాచ్ విన్నర్ అయినా డికాక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోకూడదని సన్‌రైజర్స్ డిసైడ్ అయిందట.

సన్‌రైజర్స్‌లోకి డికాక్
మంచి ఓపెనింగ్ బ్యాటర్ అయినా డికాక్.. వికెట్ కీపర్ కూడాఅన్న సంగతి తెలిసిందే. డికాక్ కీపింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాదారణంగా మంచి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఉండి, బ్యాటింగ్‌లోనూ సత్తా చాటే ఆటగాళ్లు తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో డికాక్ ఒకడు. గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ లోటు కనిపించింది. దీంతో ఈ సారి ఆ లోటును డికాక్‌తో పూడ్చేయాలని రైజర్స్ యాజమాన్యం నిర్ణయించుకుందని సమాచారం. దీనికి తోడు డికాక్ మ్యాచ్ విన్నర్ అన్న సంగతి కూడా తెలిసిందే. అలాగే ఎడమ చేతి బ్యాటర్. దీంతో ఓపెనింగ్‌లో డేవిడ్ వార్నర్ లోటును డికాక్‌తో సునాయసంగా పూడ్చొచ్చని రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక అంతర్జాతీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో డికాక్ తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు.

ధర ఎంతంటే?
ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్ డికాక్‌కు ఆ జట్టు 2.8 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ప్రస్తుతం డికాక్ స్టార్‌డమ్‌తో పాటు వాల్యూ కూడా పెరిగింది. దీంతో వేలంలో భారీ ధర పలకడం ఖాయంగా తెలుస్తోంది. కనుక డికాకు 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు చెల్లించడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం.

రిటెన్షన్ జాబితాలో దక్కని చోటు
కాగా 2022 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాలో డికాక్‌కు చోటు దక్కలేదు. దీంతో అతను ఈ సారి వేలంలో ఉండనున్నాడు. ఈ ఏడాదికి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పోలార్డ్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను రిటైన్ చేసుకుంది.

డికాక్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 77 మ్యాచ్‌లు ఆడిన డికాక్ 31 సగటుతో 2,256 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 108 పరుగులు. స్ట్రైక్‌రేట్ 130 గా ఉంది. ఈ క్రమంలో 230 ఫోర్లు, 83 సిక్స్‌లు బాదాడు.


Click it and Unblock the Notifications
