For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ స్టేడియం ఫిక్స్..క్వాలిఫయర్లు, ఎలిమినేటర్లు షిఫ్ట్

IPL 2022 Qualifier 1st and Eliminator in Kolkata, Qualifier 2nd and the Final in Ahmedabad is confirmed

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ రేసులో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వెనుకంజలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచాయి. వరుసగా నాలుగు పరాజయాలతో ముంబై ఇండియన్స్ 10 స్థానంలో నిలిచింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో సాధించిన అద్భుత విజయంతో తన వరుస ఓటములకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ వేసింది.

రోహిత్ సేనకు లైఫ్ అండ్ డెత్ గేమ్..

రోహిత్ సేనకు లైఫ్ అండ్ డెత్ గేమ్..

ఇవ్వాళ ముంబై ఇండియన్స్ తన అయిదో మ్యాచ్ ఆడనుంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడటానికి సమాయాత్తమౌతోంది. పాయింట్స్ టేబుల్ కొలీగ్ చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే వరుసగా నాలుగు పరాజయాలకు బ్రేక్ వేస్తుందా? లేక.. అధ్వాన్నపు ఫామ్‌ను కొనసాగిస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. ఈ మ్యాచ్‌లో గెలవడమే కాదు.. ఇకపై అన్నింట్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది రోహిత్ సేన.

మహారాష్ట్రను దాటని మ్యాచ్‌లు..

మహారాష్ట్రను దాటని మ్యాచ్‌లు..

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లేవీ ముంబై, పుణేలను దాటట్లేదు. ఈ రెండు నగరాలకే పరిమితం అయ్యాయి. ముంబైలోని వాంఖెడె, బ్రబౌర్న్, నవీముంబైలోని డీవై పాటిల్, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాల్లో లీగ్ దశ మ్యాచ్‌లనింటినీ నిర్వహిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందులో మార్పులు చేర్పులు చేసింది. లీగ్ దశ దాటిన తరువాత మ్యాచ్‌లన్నీ వేర్వేరు స్టేడియాలకు షిఫ్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని బీసీీసీఐ వర్గాలు ధృవీకరించాయి.

అహ్మదాబాద్‌లో..

అహ్మదాబాద్‌లో..

ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్స్‌ను నిర్వహించనుంది బీసీసీఐ. రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్ కూడా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ను కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌కు షిఫ్ట్ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాళో.. రేపో వెలువడవచ్చు. ఇదివరకు తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ను లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో నిర్వహించాలని భావించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.

కోల్‌కతలో..

కోల్‌కతలో..

లక్నోకు బదులుగా కోల్‌కతను సెలెక్ట్ చేసుకుంది బీసీసీఐ. వచ్చే నెల 22వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్ టీమ్స్ మహారాష్ట్రను వీడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌‌లో తలపడే జట్లు ముంబై నుంచి నేరుగా కోల్‌కతకు బయలుదేరి వెళ్తాయి. బయో సెక్యూరిటీ బబుల్ మధ్యే ఈ ప్రయాణ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసిన ప్లేయర్ ఖచ్చితంగా మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, April 13, 2022, 9:20 [IST]
Other articles published on Apr 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+