IPL 2022 Playoffs, Qualifier 1: వర్షం పడితే?: విజేత ఎంపిక ఇలా..హైస్కోరింగ్ ఈడెన్ పిచ్ రిపోర్ట్ ఇదీ

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కీలకమైన ప్లేఆఫ్స్ ఈ సాయంత్రం ఆరంభం కానున్నాయి. తొలి క్వాలిఫయర్ ఈ సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటాయి. 27న రెండో క్వాలిఫయర్.. 29న ఫైనల్స్‌తో ఈ సీజన్ ముగుస్తుంది.

నాలుగు జట్లల్లో ఛాంపియన్ ఎవరో..
ఈ సీజన్‌లో మొత్తం నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అడుగు పెట్టాయి. ఈ సీజన్‌తో తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండింటితో పాటు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ నాలుగింట్లో ఈ సీజన్ ఛాంపియన్ ఎవరనేది 29వ తేదీన తేలిపోతుంది.

ముంబై, పుణేలను దాటి తొలిసారి..
ఐపీఎల్ 2022 లీగ్ దశ మొత్తం ముంబై, పుణేల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. వాంఖెడె, సీసీఐ-బ్రబౌర్న్, నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఈ రెండు నగరాలను దాటింది. ప్లేఆఫ్స్, ఫైనల్స్‌ను కోల్‌కత ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వాటిని షెడ్యూల్ చేసింది. బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ సోమవారమే పిచ్‌ను పరిశీలించారు. అక్కడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

వర్షం పడుతుందా?
ఇవ్వాళ్టి కోల్‌కత వెదర్ రిపోర్ట్ మ్యాచ్ నిర్వహణకు సానుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలేవీ లేవు. పగటి ఉష్ణోగ్రత 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాత్రి ఉష్ణోగ్రత 27 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని పేర్కొంది. రాత్రి ఆకాశం మేఘావృతం అవుతుందని అభిప్రాయపడింది. కోల్‌కత, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పరిసరాల్లో వర్షం పడటానికి పగలు 48, రాత్రి 56 శాతం అవకాశం ఉంది.

హైస్కోరింగ్ పిచ్..
ఈడెన్ గార్డెన్స్ పిచ్.. క్రికెట్ ప్రేమికులకు కొత్తేమీ కాదు. హైస్కోరింగ్ పిచ్ ఇది. తొలి క్వాలిఫయర్ కోసం కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌ను క్యూరేటర్స్ తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. సమయం గడిచే కొద్దీ వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల అది బౌలర్లకు అనుకూలంగా మారుతుందని, లక్ష్యఛేదనకు దిగిన జట్టుకు ఇబ్బందులు కలగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

వర్షం పడితే..
ఐపీఎల్ అన్ని సీజన్లను పరిగణనలోకి తీసుకుంటే- ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 155 పరుగులు. సెకెండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 136. దీన్ని బట్టి అక్కడి పిచ్ పరిస్థితులను మనం అంచనా వేసుకోవచ్చు. క్వాలిఫయర్లు, ఎలిమినేటర్‌కు రిజర్వ్ డేలు లేవు. వర్షం పడితే పరిస్థితేమిటనేదానికి సమాధానం ఉంది బీసీసీఐ దగ్గర. మ్యాచ్ పూర్తిగా రద్దయినా.. విజేతను నిర్ణయించేలా ముందే మార్గదర్శకాలను రూపొందించుకుంది.

విజేత ఎలా..
ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో అయిదు ఓవర్లు కూడా వేయడానికి పరిస్థితులు అనుకూలించకపోతే- సూపర్ ఓవర్ ద్వారా విజేతను ఎంపిక చేస్తుంది బీసీసీఐ. సూపర్ ఓవర్ కూడా వేయడానికి వీలు లేకపోతే- లీగ్ దశలో అత్యధిక మ్యాచ్‌లను గెలిచిన జట్టును విన్నర్‌గా ప్రకటిస్తుంది. ఒక ఇన్నింగ్ ముగిసిన తరువాత వర్షం పడితే- డక్‌వర్త్ లూయిస్ విధానం మీద ఆధారపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications