
చివరి ఓవర్లో ప్రసీద్‌కు ముచ్చెమటలు పట్టించాడు
ఇక ఆ ఓవర్లో తెలివిగా బౌలింగ్ చేయాలని చూసిన ప్రసీద్ కు మిల్లర్ ముచ్చెమటలు పట్టించాడు. కెప్టెన్ సంజూశాంసన్, జాస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్ అందరూ కలిసి ప్రసీద్‌కు రకరకాల సజెషన్స్ ఇచ్చినా పనిచేయలేదు. ఫీల్డింగ్ మొత్తం హాఫ్ సైడ్ బౌండరీల వద్ద ఉంచగా.. లెగ్ సైడ్ 30యార్డ్ సర్కిల్లో ప్లేస్ చేశారు. ఇక ఎంచక్కా వైడ్ ఆఫ్ సైడ్ బాల్స్ వేసి స్కోరు డిఫెండ్ చేసుకోవాలని ప్రసీద్ చూశాడు. అయితే ప్రసీద్ పన్నాగాన్ని గమనించిన మిల్లర్ పూర్తిగా వికెట్లకు హాఫ్ సైడ్ వచ్చి బ్యాటింగ్ చేస్తూ ప్రసీద్ బౌలింగ్ లయను దెబ్బతీశాడు. ప్రసీద్ వేసిన తొలి బంతిని లాంగ్ ఆన్లో గుంజి కొట్టి తొలి సిక్సర్ బాదాడు. తర్వాత లెంత్ బాల్ వేయగా.. మిల్లర్ లెగ్ సైడ్లో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు. ఇక చివరి 4బంతుల్లో 6పరుగులు కావాల్సిన తరుణంలో ఎలా బౌలింగ్ చేయాలో ప్రసీద్ కు అర్థం కాలేదు. దీంతో స్లాట్లో వేయడంతో మిల్లర్ మళ్లీ సిక్సర్ తో బదులిచ్చాడు. తద్వారా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి తనకు అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ కు అద్భుతమైన గెలుపు అందించాడు.

అప్పుడు బ్రాత్ వైట్ కూడా..
ఇక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్నటి గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరి ఓవర్లో మూడు సిక్సర్లు రాగా.. గతంలో ఇదే వేదికపై కార్లస్ బ్రాత్ వైట్ అద్భుతం చేశాడు. 2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండిస్ ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. అనూహ్య మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కప్ ఫైనల్లో బ్రాత్ వైట్ చివరి ఓవర్లో అరివీర భీకరంగా ఆడడంతో వెస్టిండిస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది.

అందరి అంచనాలు తలకిందులు చేసేలా
ఆనాటి మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండిస్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పైనల్‌లో విజయం సాధించి వరల్డ్ టీ20లో ఛాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేలా 2016వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్‌లో బ్రాత్ వైట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వరుసగా 6, 6, 6, 6 సిక్స్‌లు బాది వెస్టిండిస్‌కు ప్రపంచకప్ అందించాడు. చివరి ఓవర్లో 19పరుగులు అవసరమైన దశలో అంతా ఇంగ్లాండ్ గెలుపు ఖాయమైపోయిందనుకున్నారు. అలాంటి తరుణంలో బ్రాత్ వైట్ చెలరేగి ఆడి వరుసగా నాలుగు సిక్సర్లు బాది ఇంగ్లాండ్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. సేమ్ సీన్ మళ్లీ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిన్న రిపీట్ అయింది. చివరి ఓవర్లో 16పరుగులు కావాల్సిన తరుణంలో మిల్లర్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.


Click it and Unblock the Notifications












