Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs GT Playing 11: సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్‌ ఎంట్రీ: హ్యాట్రిక్ గెలుపులపై హార్దిక్ టీమ్

IPL 2022, Punjab Kings playing 11 vs GT: Jonny Bairstow is available for selection to replace Bhanuka

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవ్వాళ కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 5 ఉన్న రెండు జట్లు తలపడనున్నాయి. ముంబై బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢీ కొనబోతోన్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ ఘన విజయాన్ని సాధించిన గుజరాత్ టైటాన్స్- రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

బెయిర్‌స్టో ఎంట్రీ..

బెయిర్‌స్టో ఎంట్రీ..

తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏమిటో చాటి చెప్పింది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయినా.. వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది. తనకంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. ఇప్పుడు తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనబోతోంది. జానీ బెయిర్‌స్టో- తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతను జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. భానుక రాజపక్సను బెయిర్‌స్టోతో రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆల్ రౌండర్లతో..

ఆల్ రౌండర్లతో..

మెగా ఆక్షన్ తరువాత టీమ్ మొత్తాన్నీ ఆల్‌రౌండర్లతో నింపేసింది. మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో కొత్తగా కొత్తగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, శిఖర్ ధవన్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, షారుఖ్‌ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, నాథన్ ఎల్లీస్, భానుక రాజపక్స, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రాజ్ ఆనంద్ బావా, రిత్తిక్ ఛటర్జీ.. సీనియర్లు, జూనియర్లతో మంచి బ్యాకప్‌ను సిద్ధం చేసుకుంది. దాని ఎఫెక్ట్ కనిపించింది. మూడింట్లో రెండు విజయాలను అందుకుంది.

లియామ్.. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్

లియామ్.. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్

మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ ప్రతిభను కనపరిచింది. లియామ్ లివింగ్‌స్టోన్ సునామీలా చెలరేగాడు. 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అతని దెబ్బకు పంజాబ్ కింగ్స్ 180 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించగలిగింది. బౌలర్లు కూడా చెలరేగారు. చెన్నైను కట్టడి చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. రాహుల్ చాహర్-3, వైభవ్ అరోరా, లియామ్ లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. బౌలర్ల మాయాజాలానికి చెన్నై సూపర్ కింగ్స్ 126 పరుగులకు కుప్పకూలింది.

ఓటమి ఎరుగని గుజరాత్..

ఓటమి ఎరుగని గుజరాత్..

పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్‌ కూడా తక్కువేమీ తినలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జట్టు సైతం ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రదర్శిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో బలమైన ఢిల్లీ కేపిటల్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది.

 గుజరాత్ తక్కువేమీ కాదు..

గుజరాత్ తక్కువేమీ కాదు..

గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఈ సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. దానికి సమానంగా ఈ కొత్త జట్టు రాణిస్తుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, లోకీ ఫెర్గూసన్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్ వంటి ప్లేయర్లతో నిండి ఉంది గుజరాత్ బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్. భారీ భాగస్వామ్యాన్ని నిర్మించగల ప్లేయర్లు ఉన్నారీ టీమ్‌లో. విజయానికి ఢోకా ఉండకపోవచ్చు.

తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), జానీ బెయిర్‌స్టో/భానుక రాజపక్స (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, మహ్మద్ షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్ టీమ్‌లో- శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, లోకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్/వరుణ్ అరోరా/యష్ దయాళ్/దర్శన్ నల్కండే, మహ్మద్ షమీ

1
53625
Story first published: Friday, April 8, 2022, 18:50 [IST]
Other articles published on Apr 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+