Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: రాజ‌ప‌క్స సిక్స‌ర్ల‌ వ‌ర్షం.. ఐపీఎల్ 2022లో తొలి హ్యాట్రిక్ సిక్సర్లు న‌మోదు

IPL 2022: Punjab Kings batsman Bhanuka Rajapaksa hits a hat-trick of sixes in the match against Kolkata Knight Riders

ఐపీఎల్ 2022లో తొలి హ్యాట్రిక్ సిక్సర్లు న‌మోదయ్యాయి. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్ భానుక రాజపక్స ఈ సీజ‌న్‌లో తొలి హ్యాట్రిక్ సిక్స‌ర్ల న‌మోదు చేశాడు. కేకేఆర్ బౌల‌ర్‌ శివ‌మ్ మావి వేసిన నాల్గో ఓవ‌ర్‌లో రాజ‌ప‌క్స ఈ రికార్డును అందుకున్నాడు. ఆ ఓవ‌ర్ తొలి బంత‌ని 4 బాదిన రాజ‌ప‌క్స‌.. రెండు, మూడు, నాలుగు బంతుల‌ను వ‌రుస‌గా సిక్సులు బాదాడు. అయితే దుర‌దృష్ట‌వశాత్తు హ్యాట్రిక్ సిక్ల‌ర్లు బాదిన వెంట‌నే రాజ‌ప‌క్స ఔట్ అయ్యాడు. అదే ఓవ‌ర్‌లో ఐదో బంతిని కూడా భారీ షాట్‌కు ప్ర‌యత్నించిన రాజ‌ప‌క్స పీల్డ‌ర్ సౌథీకి దొరికిపోయాడు. దీంతో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా క్రీజులో ఎదుర్కొన్న తొలి బంతినే రాజ‌ప‌క్సే బౌండ‌రీతో మొద‌లు పెట్టాడు. ఇక‌ ఈ మ్యాచ్‌లో రాజ‌ప‌క్స 9 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 344 స్ట్రైక్‌రేట్‌తో 31 ప‌రుగులు బాదేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి.

ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను కేకేఆర్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. ఆ జ‌ట్టు కెప్టెన్ మయాంక్ అగ‌ర్వాల్‌ను ఒకే ప‌రుగుకు ఎల్బీడ‌బ్య్లూలో ఔట్ చేశాడు. కాగా ప‌వ‌ర్‌ప్లే ముగిసే స‌మ‌యానికి పంజాబ్ 3 వికెట్ల న‌ష్టానికి 62 ప‌రుగులు చేసింది. క్రీజులో లివింగ్ స్టోన్, రాజ్ బ‌వా ఉన్నారు.

తుది జ‌ట్లు:
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీప‌ర్), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, April 1, 2022, 20:25 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+