Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి బిగ్ షాక్: నడిరోడ్డు మీద బస్సును ఆపేస్తారా: భారీగా ఫిర్యాదులు: ఐపీఎల్ కీలక నిర్ణయం

IPL 2022 promo featuring MS Dhoni as a bus driver is set to be withdrawn after a complaint
IPL 2022 : Ms Dhoni యాడ్ పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం | Oneindia Telugu

ముంబై: మహేంద్ర సింగ్ ధోనీకి బిగ్ షాక్. ఇప్పటికే అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమౌతోంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. అటు జట్టుతో పాటు పనిలోపనిగా ధోనీ ప్రదర్శన మీద విమర్శలు తలెత్తాయి. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే ధోనీపై ఆరోపణాస్త్రాలను సైతం సంధించారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ క్రీజ్‌లోఉండి కూడా జట్టును గెలిపించలేకపోయాడని, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో దూకుడుగా ఆడిన శివం దుబేతో స్ట్రైక్ రొటేట్ చేయకుండా నిర్లక్ష్యం చేశాడనీ మండిపడ్డారు.

ధోనీ ప్రోమో నిలిపివేత..

ధోనీ ప్రోమో నిలిపివేత..

ఈ పరిస్థితుల్లో ఉన్న ధోనీకి మరో షాక్ తగిలింది. ఆయన సరికొత్త రూపంలో కనిపించిన ఐపీఎల్ ప్రోమోపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్స్యూమర్ ఫోరమ్స్ ఈ ప్రోమోపై ఫిర్యాదులు సైతం నమోదు అయ్యాయి. ఫలితంగా- ఈ ప్రోమోను ఉపసంహరించుకోవాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.

దీనికి ముహూర్తం కూడా పెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ప్రోమో ఇక ఎక్కడా కనిపించకపోవచ్చు. దాన్ని టెలికాస్ట్ చేయడాన్ని నిలిపివేయనుంది.

బస్ డ్రైవర్‌గా తలైవా..

బస్ డ్రైవర్‌గా తలైవా..

ధోనీ ఎప్పుడూ లేనివిధంగా బస్ డ్రైవర్‌గా కనిపించిన ప్రోమో అది. బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోన్న ధోనీ.. ఓ షోరూమ్ ఎదురుగా దాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపేస్తాడు. షోరూమ్‌లో అమ్మకానికి ఉంచిన టీవీల్లో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుండగా దాన్ని చూస్తూ బస్సు డోర్ వద్ద కూర్చుండిపోతాడు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ చూడాలనీ సూచిస్తాడు. బస్సును రోడ్డు మధ్యలో ఆపేయడంతో దాని వెనుక వస్తోన్న వాహనాలన్నీ నిలిచిపోతాయి. దీనితో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

https://telugu.mykhel.com/cricket/players/ms-dhoni-ipl-p3243/

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన..

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన..

అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సును రోడ్డు మధ్యలో ఎందుకు ఆపేశావని ప్రశ్నించగా- సూపర్ ఓవర్ నడుస్తోందంటూ మైక్‌లో కాస్త నిర్లక్ష్యంగానే సమాధానం ఇస్తాడు ధోనీ. ఓకే తలైవా అంటూ చిరునవ్వుతో వెళ్లిపోతాడా ట్రాఫిక్ కానిస్టేబుల్. ఐపీఎల్ 2022 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రోమో ఇది. కొంతకాలంగా ఇది టెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రోమో విమర్శలకు కేంద్రబిందువయింది.

అడ్వర్టయిజింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..

ఈ ప్రోమోను ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేలా వాహనదారులకు సూచిస్తోందంటూ ఒకట్రెండు కన్స్యూమర్ ఫోరమ్స్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ ఈ విషయాన్ని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (యాస్కీ) దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంది యాస్కీ. ఈ ప్రోమోను నిలిపివేయాలంటూ ఐపీఎల్‌ను ఆదేశించింది.

20 నుంచి

20 నుంచి

ఈ ప్రోమోను నిలిపివేయడానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కొంత గడువును కోరింది. ఈ నెల 20వ తేదీ నుంచి టెలికాస్ట్ చేయబోమని స్పష్టం చేసింది. కాగా- ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస అపజయాలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడింది. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కొనబోతోంది.

Story first published: Thursday, April 7, 2022, 12:17 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+