
శతృదుర్భేద్యంగా..
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్.. తన సొంత రాష్ట్రంలో ఈ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సీజన్‌లోనే ఫైనల్స్ దాకా వచ్చిందా జట్టు. లీగ్ దశలో తిరుగులేని విజయాలను అందుకుంది. 14 మ్యాచ్‌లల్లో పదింట గెలిచింది. తొలిసారిగా కేప్టెన్‌గా పగ్గాలను అందుకున్న హార్దిక్ పాండ్యా తన జట్టును శతృదుర్భేద్యంగా తీర్చిదిద్దాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి బలమైన జట్లను మట్టి కరిపించింది.

అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే..
ఈ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించగలిగితే- ఓ కొత్త చరిత్ర లిఖించినట్టవుతుంది. అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా ఆవిర్భవించిన జట్టవుతుంది. ఈ సీజన్‌లో కొత్త జట్టు కప్‌ను కట్టినట్టవుతుంది. ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ కింగ్స్ సైతం ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టింది గానీ.. తన ప్రస్థానాన్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో విఫలమైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన ఈ కేఎల్ రాహుల్ టీమ్.. ఎలిమినేటర్‌లో పరాజయాన్ని చవి చూసింది.

రెండోసారి కప్..
రాజస్థాన్ రాయల్స్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2008లో ఐపీఎల్ ఆరంభమైన తరువాత ఛాంపియన్‌గా అవతరించిందీ టీమ్. ఇటీవలే కన్నుమూసిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్- సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి సీజన్ విన్నర్‌గా నిలిచింది. మళ్లీ అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. హేమాహేమీల్లాంటి జట్లను ఓడించి- ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీన్ని విజయంగా మలచుకుంటుందా? లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ప్రైజ్ మనీ వివరాలివే..
కాగా- ఫైనల్ మ్యాచ్ విజేతకు దిమ్మతిరిగే రేంజ్‌లో ప్రైజ్ మనీ దక్కబోతోంది. ఛాంపియన్‌గా ఆవిర్భవించిన జట్టుకు లభించే ప్రైజ్ మనీ మొత్తం 20 కోట్ల రూపాయలు. దీన్ని ఎవరు ఎగరేసుకెళ్తారనేది ఉత్కంఠతగా మారింది. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దక్కే ప్రైజ్ మనీ 13 కోట్ల రూపాయలు. వచ్చే సంవత్సరం అంటే.. ఐపీఎల్ 2023 సీజన్ నాటికి ఈ మొత్తాన్ని మరింత పెంచేలా బీసీసీఐ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం 23 లేదా 25 కోట్ల రూపాయలకు పెంచవచ్చని సమాచారం.

ప్రధాని చేతుల మీదుగా..
మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. మూడో స్థానంలో నిలిచిన టీమ్-7 కోట్ల రూపాయలు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 6.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ స్థానాల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విజేతకు కప్‌ను అందిస్తారు.


Click it and Unblock the Notifications












