For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RR Playing 11: మయాంక్ మేజిక్ పని చేయట్లే: ఆ ఒక్క మార్పుతో పింక్ టీమ్: తుదిజట్లివే

Punjab Kings playing catch up in the race for the playoffs.

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ గెలిచింది. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది రెండో గెలుపు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది రెండే. ప్లేఆఫ్స్‌కు వెళ్తుందనే ఆశలేవీ ఆ టీమ్ మీద లేవు. తన ప్రత్యర్థి ప్లేఆఫ్స్ అవకాశాలను మాత్రం గండి కొట్టేలా తయారైంది.

పడుతూ లేస్తోన్న పంజాబ్..

పడుతూ లేస్తోన్న పంజాబ్..

పంజాబ్ కింగ్స్‌దీ అదే దుస్థితి. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో నెగ్గింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది పాయింట్ల పట్టికలో. తన చివరి మ్యాచ్‌లో బలమైన గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించిన ఉత్సాహంతో ఉందీ మయాంక్ అగర్వాల్ టీమ్. ఇవ్వాళ రాజస్థాన్ రాయల్స్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

వరుసగా రెండింట్లో ఓడిందే గానీ..

వరుసగా రెండింట్లో ఓడిందే గానీ..

పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ వస్తోంది ఈ టోర్నమెంట్‌లో. సగం టోర్నమెంట్ పూర్తయినా అదే పరిస్థిితిని ఎదుర్కొంటోంది. 10 మ్యాచ్‌లను ఆడిన తరువాత కూడా వరుసగా రెండింట్లో విజయం సాధించలేదు. ఒక గెలుపు, ఒక ఓటమి తరహాలో సాగుతోంది. వరుసగా రెండు ఓటములను నమోదు చేసిందే గానీ.. రెండు విజయాలను అందుకోవట్లేదు. సన్‌రైజర్స్, ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిన తరువాత చెన్నైపై విజయం సాధించింది. మళ్లీ లక్నో చేతిలో ఓడింది. గుజరాత్‌పై గెలిచింది. అదే సీక్వెన్స్‌ ప్రకారం ఆడితే ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఓటమి తప్పకపోవచ్చు.

 బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..

బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..

శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భానుక రాజపక్స.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ చూడ్డానికి బాగుంది. నిలకడగా ఆడుతున్నది మాత్రం ఒకరిద్దరే. అంతకుముందు లక్నో నిర్దేశించిన 153 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేదించలేకపోయిన పంజాబ్ బ్యాటర్లు.. అనంతరం గుజరాత్ టైటాన్స్‌‌ లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టానికే కొట్టేశారు. ఇది నిలకడ లేమిని సూచిస్తోంది.

బౌలర్లు గాడినపడినట్టేనా..

బౌలర్లు గాడినపడినట్టేనా..

గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలవడానికి ప్రధాన కారణం- బౌలర్లే. నిప్పులు చెరిగారు పేసర్లు. ప్రత్యేకించి- కగిసొ రబడ. నాలుగు వికెట్లను కూల్చాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అదే తరహాలో ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా రాణించాలని కోరుకుంటోంది టీమ్ మేనేజ్‌మెంట్. రిషిధవన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మలతో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలంగానే ఉంది. వారందరూ నిలకడగా ఆడాల్సి ఉంది.

వరుసగా రెండో ఓటములతో రాజస్థాన్

వరుసగా రెండో ఓటములతో రాజస్థాన్

సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ తన ఫామ్‌ను కోల్పోయిందా అనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఇందులోనూ ఓడితే హ్యాట్రిక్ కొట్టినట్టే. పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌ల్లలో నాలుగింట్లో ఓడింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడు గెలుపులు.. రెండు ఓటములను అందుకుందీ పింక్ టీమ్. ఈ వరుస ఓటములకు బ్రేక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది రాజస్థాన్ రాయల్స్.

 హిట్టర్లు.. ఆల్‌రౌండర్లు..

హిట్టర్లు.. ఆల్‌రౌండర్లు..

ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా పించ్ హిట్టర్లు ఆల్‌రౌండర్లతో నిండివుంది. రాజస్థాన్ రాయల్స్ ఓ మార్పుతో బరిలోకి దిగొచ్చు. కరుణ్ నాయర్ లేదా యశస్వి జైస్వాల్‌లల్లో ఒకరికి తుదిజట్టులో అవకాశం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. వారితో పంజాబ్ బౌలర్లు రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ పోరు ఈ మధ్యాహ్నం చూడొచ్చు.

తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌లో- జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్-వికెట్ కీపర్), కరుణ్ నాయర్/యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ సేన్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

Story first published: Saturday, May 7, 2022, 7:22 [IST]
Other articles published on May 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+