For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs LSG Playing 11: ఇలాగైతే నెక్స్ట్ కష్టమే: బౌలింగ్‌లో ఆ కీలక మార్పు

IPL 2022, PBKS vs LSG playing 11: Avesh Khan or Mohsin Khan likely to include

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌ రసవత్తరంగా సాగుతోంది. టోర్నమెంట్ ఆరంభంలో ఫర్వాలేదనిపించుకుంటూ వచ్చిన కోల్‌కత నైట్‌రైడర్స్.. పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది. వరుసగా అయిదో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. గురువారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది ముచ్చటగా మూడే. ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

1
4-2022
1
53651
పంజాబ్ కథ కూడా అలాంటిదే..

పంజాబ్ కథ కూడా అలాంటిదే..

నీది నాది ఒకే కథ అన్నట్టు తయారైంది పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో నెగ్గింది. ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించకపోయి ఉంటే పరిస్థితి మరింత దయనీయంగా మారేంది. ఆ విజయం ఊరట కల్పించినట్టయింది. ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కొనబోతోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

మార్పుల్లేకుండా..

మార్పుల్లేకుండా..

మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఇదివరకటి సీజన్ల కంటే చాలా మెరుగ్గా ఆడుతూ వచ్చింది టోర్నమెంట్ ఆరంభంలో. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ నిలకడను కోల్పోయింది. ఒక గెలుపు, ఒక ఓటమి తరహాలో సాగుతోంది. సన్‌రైజర్స్, ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిన తరువాత చెన్నైపై విజయం సాధించడం కొంత ఊపిరిపోసిందా జట్టుకు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

 బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..

బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..

శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భానుక రాజపక్స.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ.. ఆడుతున్నది మాత్రం ఒకరిద్దరే. లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో దూకుడు కొనసాగించగలిగితేనే భారీ స్కోర్ చేయగలదు. చెన్నైపై శిఖర్ ధవన్ దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్‌లోనూ అతను ఆడాల్సి ఉంటుంది. బెయిర్‌స్టో, భానుక, ఓడియన్ స్మిత్.. ఈ ముగ్గురూ భారీ షాట్లను అవలీలగా ఆడేయగలరు గానీ నిలకడగా ఉండట్లేదు.

బౌలింగ్ బలహీనంగా..

బౌలింగ్ బలహీనంగా..

పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను రబడ లీడ్ చేస్తోన్నప్పటికీ.. పేస్ డిపార్ట్‌మెంట్ బలహీనపడింది. షారుఖ్ ఖాన్, ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌తో కూడిన బౌలింగ్‌ విభాగంలో రబడ ఓ లెథల్ వెపన్‌గా చెప్పుకోవడంలో సందేహాలు అక్కర్లేదు. ఆ పదును కనిపించట్లేదు బౌలర్లలో. దూకుడు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను ఎలా నియంత్రించగలుగుతారనేది ఆసక్తికరం.

 సేఫ్ జోన్‌లో లక్నో..

సేఫ్ జోన్‌లో లక్నో..

కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్.. తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తోంది. సేఫ్ జోన్‌లో ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లలో అయిదింట్లో విజయాలను సాధించింది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ ఊపు మీదున్నాడు. క్వింటన్ డికాక్, మనీష్ పాండే ఫామ్‌ను కోల్పోవడం కొంత ఆందోళన కలిగిస్తోన్నప్పటికీ.. మిడిలార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, లోయర్ ఆర్డర్‌లో జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్ సత్తా చాటుతున్నారు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యాలతో అటు బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

 తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌లో- కేఎల్ రాహుల్ (కేప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్/మొహసిన్ ఖాన్ ఆడొచ్చు.

Story first published: Friday, April 29, 2022, 7:24 [IST]
Other articles published on Apr 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+