Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం పెట్టుకొచ్చావురా నాయన: లివింగ్‌స్టొన్ భారీ సిక్స్..బ్యాట్‌ను చెక్ చేసిన రషీద్ ఖాన్

IPL 2022, PBKS vs GT: Rashid Khan went on to check Liam Livingstones bat after he hit 117m 6

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు కళ్లెం వేసింది. ఆ జట్టును నేలకు దించింది. అయిదు మ్యాచ్‌ల వరుస విజయాల తరువాత ఓటమిని పరిచయం చేసింది. బుధవారం రాత్రి నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్‌ విజయఢంకా మోగించింది. ఒక గెలుపు, ఒక ఓటమి ట్రెడీషన్‌ను కంటిన్యూ చేస్తోంది పంజాబ్. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోఓడిన తరువాత ఈ మ్యాచ్‌లో గెలిచింది.

1
4-2022

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది పంజాబ్ కింగ్స్. తొలుత ఫీల్డింగ్ చేసి.. ఆ జట్టును 143 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో రబడ నిప్పులు చెరిగాడు. బుల్లెట్‌లాంటి బంతులను సంధించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి- నాలుగు వికెట్లు పడగొట్టాడు. వృద్దిమాన్ సాహా, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్‌ వికెట్లు తీసుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టొన్ అతనికి తమవంతు సహకారాన్ని అందించారు. ఈ ముగ్గురూ ఒక్కో వికెట్ కూల్చారు.

IPL 2022, PBKS vs GT: Rashid Khan went on to check Liam Livingstones bat after he hit 117m 6

ఈ లక్ష్యాన్ని 16 ఓవర్లల్లోనే రెండు వికెట్లను కోల్పోయి కొట్టేసింది పంజాబ్ కింగ్స్. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన జానీ బెయిర్‌స్టో త్వరగానే అవుట్ అయినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు తమ పని పూర్తి చేశారు. ఓపెనర్ శిఖర్ ధవన్ 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భానుక రాజపక్స 28 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టొన్ సునామీ ఇన్నింగ్ ఆడాడు. 10 పరుగుల్లో 30 పరుగులు కొట్టి అవతల పడేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.

16వ ఓవర్‌లో మహ్మద్ షమీకి చుక్కలు చూపాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. తొలి బంతికి అతను కొట్టిన సిక్స్.. రాకెట్లా దూసుకెళ్లింది. 117 మీటర్ల దూరం వెళ్లి పడింది. మిడిల్ స్టంప్‌పై షమీ విసిరిన లెంగ్త్ బాల్‌ను డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా కొట్టిన సిక్స్ ఓ అద్భుతం. ఆ తరువాత రెండు, మూడు బంతులకూ అదే గతి పట్టించాడు. హ్యాట్రిక్ సిక్స్ కొట్టాడు. నాలుగు, ఆరు బంతులకు ఫోర్ కొట్టడంతో పంజాబ్ గెలుపు పరిపూర్ణమైంది.

తొలి సిక్స్ కొట్టిన తరువాత గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. లివింగ్‌స్టొన్ దగ్గరికి వెళ్లి బ్యాట్‌ను పరిశీలించాడు. ఇందులో ఏం పెట్టుకొస్తే.. అంత భారీ సిక్స్ కొట్టాడోనని టెస్ట్ చేసి చూశాడు.. నవ్వుకుంటూ. రెండుమూడు సార్లు బ్యాట్‌ను తట్టి మరీ చెక్ చేశాడు. అంత భారీ సిక్స్ కొడితే ఎవరికైనా వచ్చే డౌటే అది. ఈ సీజన్‌లో అతను కొట్టిన మూడో అతి భారీ సిక్స్ ఇది. ఇదివరకు 108, 106 మీటర్ల దూరం మేర బంతులను రాకెట్లా పంపించాడు.

ఐపీఎల్ చరిత్రలో అతి భారీ సిక్స్‌ను కొట్టిన ఘనత అల్బే మోర్కెల్ పేరు మీద ఉంది అది ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మోర్కెల్ కొట్టిన షాట్‌కు బంతి 125 మీటర్ల దూరం వెళ్లి పడింది. ఆ తరువాత ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల దూరం మేర సిక్స్ కొట్టాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్-122, రాబిన్ ఉతప్ప-120, క్రిస్ గేల్-119, యువరాజ్ సింగ్-119, రాస్ టేలర్-119, లివింగ్‌స్టొన్-117, గౌతమ్ గంభీర్-117, బెన్ కట్టింగ్-117 మీటర్ల దూరం మేర సిక్స్‌ను బాదారు. డెవాల్డ్ బ్రెవిస్-111, జోస్ బట్లర్-107 మీటర్ల దూరానికి సిక్స్ కొట్టారు. లివింగ్‌స్టొన్ కొట్టిన మూడింటితో పాటు ఈ రెండూ ఈ సీజన్‌లో రికార్డయినవే.

Story first published: Wednesday, May 4, 2022, 9:41 [IST]
Other articles published on May 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+