IPL 2022: అలా ఆడితే మా కోచ్‌లు పిచ్చోడిలా చూసేవారు.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

తమ తరంలో బ్యాటర్లు విభిన్నమైన షాట్లు ఆడితే కోచ్‌లు పిచ్చోడిలా చూసేవారని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, యువ ఆటగాళ్లు విభిన్నమైన షాట్లతో అభిమానులను అలరిస్తున్నారని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

కోచ్‌లు పిచ్చోడిలా చూసేవారు
తమ తరం క్రికెటర్లు టెస్ట్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారని, ఆ రోజుల్లో స్విస్, రివర్స్ స్విప్, స్కూప్ ఆడితే కోచ్‌లు పిచ్చోడిలా చూసేవారని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యువ ఆటగాళ్లు పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతున్నారని, అవకాశం వస్తే ఏ ఫార్మాట్లోనైనా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్ కారణంగా చాలా మంది యువ ఆటగాళ్లు చిన్న వయసులోని వెలుగులోకి వస్తున్నారని, అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణిస్తున్నారని రవిశాస్త్రి కొనియాడాడు.

ఆయుష్ బదోనికి మంచి భవిష్యత్
ఇక ఈ ఐపీఎల్ సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుష్ బదోని తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. సానుకూల స్వభావంతో ఏ మాత్రం భయం లేకుండా షాట్లు బాదేస్తూ, చకచక స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఏ బంతి ఎలా ఆడాలో ఆయుష్ బదోనికి బాగా తెలుసని, అతనికి మంచి భవిష్యత్ ఉందని రవిశాస్త్రి తెలిపాడు.

లక్నో వర్సెస్ ఢిల్లీ
కాగా ఐపీఎల్ 2022లో మరికాసేపట్లో ఆసక్తిరక పోరు జరగబోతుంది. లక్నోసూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు లక్నో 3 మ్యాచ్‌లు ఆడి రెండు గెలవగా.. ఢిల్లీ 2 ఆడి ఒకటి గెలిచింది.

లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, దుష్మంతం చమీర, కైల్ మేయర్స్, అంకిత్ రాజ్‌పూత్, కృష్ణప్ప గౌతమ్, మార్కస్ స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్:
రిషబ్ పంత్ (కెప్టెన్& వికెట్ కీపర్), పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, షర్మాన్ పావెల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, అశ్విన్ హెబ్బార్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శ్రీకర్ భరత్, సర్ఫరాజ్ ఖాన్, లుంగి ఎన్గిడి, ప్రవీణ్ దూబే, అన్రిచ్ నోర్ట్జే, కమలేష్ నాగర్‌కోటి, చేతన్ సకారియా, రిపాల్ పటేల్, వికీ ధుల్, వికీ ధుల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications