కెప్టెన్‌గా డుప్లెసిస్
రాబోయే ఐపీఎల్ సీజన్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమించినట్లు ఆ జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అలాగే బెంగళూర్‌లో జరిగిన అన్‌బాక్స్ ఈవెంట్‌లో ప్రకటించింది. కాగా ఈ నెల 12న తమ జట్టు కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటిస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ సౌతాఫ్రికా ఆటగాడికి కెప్టెన్‌గా మంచి రికార్డులున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికాకు 115 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన డుప్లెసిస్ ఆ జట్టుకు 81 మ్యాచ్‌ల్లో విజయాలు అందించాడు.

రూ.7 కోట్లకు కొనుగోలు
మెగా వేలంలో 37 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. గతేడాది చెన్నైసూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్ 633 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2018 నుంచి 2021 వరకు చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతనితోపాలు దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా, ఫిన్ అలెన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డేవిడ్ విల్లీ, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్ వంటి తదితర ఆటగాళ్లను మెగా వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. మెగా వేలంలో ఆర్సీబీ అత్యధికంగా పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌కు 10 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చిచింది.

పంజాబ్‌తో మొదలు
ఐపీఎల్ 2022లో తమ పోరాటాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్ కింగ్స్‌తో మొదలుపెట్టనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ నెల 27న ఈ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్ చేరినప్పటికీ ఒక్క సారి కూడా ట్రోఫీ అందుకులేకపోయింది. కాగా ఆర్సీబీ ఇప్పటివరకు 2009, 2011, 2016లో ఫైనల్ చేరింది.

ఆర్సీబీ పూర్తి జట్టు ఇదే
విరాట్ కోహ్లీ(15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో(11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్ పటేల్(10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్ కార్తీక్(5.5 కోట్లు), జోష్ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్(2.4 కోట్లు), అనుజ్ రావత్(3.4 కోట్లు), డేవిడ్ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్ లామ్రోర్(95 లక్షలు), ఫిన్ అలెన్ ( 80 లక్షలు), జేసన్ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్ కౌల్(75 లక్షలు), కర్ణ్ శర్మ(50 లక్షలు), చామ మిలింద్(25 లక్షలు), సుయాశ్ ప్రభుదేశాయ్(30 లక్షలు), ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియా(వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications












