IPL 2022: యువ ఆటగాళ్లు రానా, పడిక్కల్, హర్షల్, దీపక్‌లను కోటీశ్వరులను చేసిన మెగా వేలం!

బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. టాలెంటెడ్ యువ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. అలాగే భారీ ధర పలుకుతారని ఆశించిన పలువురికి నిరాశజనక ధర రాగా, పెదగా అంచనాలు లేకండా వేలంలోకి వచ్చిన వారికి భారీ ధర దక్కింది. ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాళ్లకు మెగా వేలంలో ప్రాంచైజీలు భారీ ధర వెచ్చించాయి. విచిత్రంగా గతంలో తమ టీంలోనే ఉన్న పలువురు ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ అవే టీంలు అంతకంటే డబుల్ ధర వెచ్చించి కొనుగోలు చేశాయి.
హర్షల్‌పై కోట్ల వర్షం
టీమిండియా యువ పేసర్ హర్షల్ పటేల్‌పై ఐపీఎల్ మెగా వేలంలో కోట్ల వర్షం కురిసింది. గతేడాది 20 లక్షల రూపాయలు మాత్రమే ఉన్న హర్షల్‌పటేల్‌కు ఈ సారి రికార్డు స్థాయిలో వేలంలో 10 కోట్ల 75 లక్షల రూపాయల ధర లభించింది. గత ఏడాది ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టే హర్షల్‌ను మళ్లీ కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్‌కు గత సీజన్లో ధర ఇప్పుడున్న ధర చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్ల పెడుతున్నారు.
డబుల్ అయినా రానా ధర
మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో బరిలోకి దిగిన నితీష్ రానాను కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. నితీష్ రానాకు కేకేఆర్ 8 కోట్ల రూపాయల వెచ్చించింది. కాగా గత ఏడాది కూడా నితీష్ రానా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడిని కోల్‌కతా వేలంలో మళ్లీ దక్కించుకుంది. గతేడాది రానాకు కేకేఆర్ 3 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ సారి వేలంలో ఇది డబుల్ అయింది. గతం కంటే ఏకంగా 4 కోట్ల 60 లక్షల రూపాయలు ఎక్కువగా దక్కాయి.
పడిక్కల్‌కు భారీ ధర
మరో టీమిండియా యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ 7 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలోకి పడిక్కల్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వచ్చాడు. గత ఏడాది రాయల్ చాలెంజర్జ్ బెంగళూరు తరఫున ఆడిన పడిక్కల్‌కు ఆ జట్టు 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. దీంతో ఈ సారి పడిక్కల్‌కు గతంలో కంటే ఏకంగా 7 కోట్ల 55 లక్షల రూపాయలు ఎక్కువగా లభించాయి.

దీపక్‌ను వరించిన కోట్ల రూపాయలు
ఈ మెగా వేలంలో 75 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగిన దీపక్ హుడాను లక్నో సూపర్ జెయింట్స్ 5 కోట్ల 75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. గత ఏడాది దీపక్‌కు ఐపీఎల్‌లో 50 లక్షలే దక్కాయి. దీంతో ఈ సారి గతంలో కంటే దీపక్‌కు ఏకంగా 5 కోట్ల 25 లక్షల రూపాయలు ఎక్కువగా లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications