For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సూప‌ర్ ఫామ్‌లో నికోల‌స్ పూర‌న్.. ప్రాక్టీస్‌లోనూ విధ్వంసం.. ప్ర‌త్య‌ర్థుల‌కు డేంజ‌ర్ బెల్స్‌

IPL 2022: Nicholas Pooran Continues Good farm.. He scored 45 off just 30 balls in the Sunrisers Hyderabad practice match

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. మ‌రో 4 రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో నిర్వ‌హించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ పూర‌న్ త‌న ఫామ్‌ను చాటుకున్నాడు. త‌న జ‌ట్టును ఒంటి చేతితో గెలిపించాడు. దీంతో త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లోనూ పూర‌న్ ఇలాగే చెల‌రేగాల‌ని టీం మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

ప్రాక్టీస్‌లో చెల‌రేగిన పూర‌న్

ప్రాక్టీస్‌లో చెల‌రేగిన పూర‌న్

ఐపీఎల్ 2022కు స‌న్నాహాకంగా నిర్వ‌హించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నికోల‌స్ పూర‌న్ చెల‌రేగాడు. 30 బంతుల్లోనే 45 ప‌రుగులు చేసి తాను ప్రాతినిధ్యం వ‌హించిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీంను గెలిపించాడు. దీంతో లీగ్ ఆరంభానికి ముందే పూర‌న్ ప్ర‌త్య‌ర్థుల‌కు డేంజ‌ర్ బెల్స్ పంపిన‌ట్టైంది. ఇక‌ పూర‌న్ ఫామ్‌పై స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగా మంచి హిట్ట‌రైన పూర‌న్ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే స‌న్‌రైజ‌ర్స్‌కు గెలుపు పెద‌గా క‌ష్టం కాద‌ని అభిప్రాయ‌డుతున్నారు. కాగా మెగా వేలంలో నికోల‌స్ పూర‌న్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 10 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్‌పై చెల‌రేగిన పూర‌న్.. హ్యాట్రిక్ హాఫ్ సెంచ‌రీలు

భార‌త్‌పై చెల‌రేగిన పూర‌న్.. హ్యాట్రిక్ హాఫ్ సెంచ‌రీలు

గ‌త నెల‌లో భార‌త్ వేదిక‌గా జ‌రిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ త‌ర‌ఫున నికోల‌స్ పూర‌న్ చెల‌రేగాడు. ఈ సిరీస్‌లో భార‌త్ చేతిలో విండీస్ క్లీన్‌స్వీప్ అయిన‌ప్ప‌టికీ పూర‌న్ మాత్రం స‌త్తా చాటాడు. మిగ‌తా ఆట‌గాళ్లంతా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ పూర‌న్ మాత్రం ఒంట‌రి పోరాటం చేశాడు. 3 టీ20 మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. తద్వారా హ్యాట్రిక్ హాఫ్ సెంచ‌రీల‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొద‌టి టీ20లో 43 బంతుల్లో 61 ప‌రుగులు చేసిన పూర‌న్, రెండో టీ20లో 41 బంతుల్లో 62, మూడో టీ20ల్లో 47 బంతుల్లో 61 ప‌రుగుల‌తో చెలరేగాడు. కాగా రానున్న ఐపీఎల్ కూడా భార‌త్‌లోనే జ‌ర‌గ‌నుండ‌డంతో నికోల‌స్ పూర‌న్ ఇదే ఫామ్‌తో చెల‌రేగ‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌డుతున్నారు.

భువి టీం ఘ‌న‌విజయం

భువి టీం ఘ‌న‌విజయం

ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీం ఆట‌గాళ్లు రెండు టీంలుగా విడిపోయి త‌ల‌ప‌డ్డారు. మొద‌టి టీంకు కేన్ విలియమ్స‌న్ నాయ‌క‌త్వం వ‌హించ‌గా.. మ‌రో టీంకు భువ‌నేశ్వ‌ర్ కుమార్ నాయ‌క‌త్వం వ‌హించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన విలియ‌మ్స‌న్ టీం 146 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని భువ‌నేశ్వ‌ర్ కుమార్ 15 ఓవ‌ర్ల‌లోనే చేధించి 6 వికెట్లు తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి టీం

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి టీం

కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మాక్ర‌మ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హక్ ఫరూకీ.

Story first published: Monday, March 21, 2022, 22:30 [IST]
Other articles published on Mar 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+