For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై సూపర్ కింగ్స్‌లో కివీస్ ఆటంబాంబ్: రుతురాజ్ గైక్వాడ్‌కు పార్ట్‌నర్ దొరికినట్టే

 IPL 2022: New Zealand cricketer Devon Conway sold to CSK at Rs 1 Cr.
IPL Auction 2022: Devon Conway To CSK | U19 Players Became Millionaires | Oneindia Telugu

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ ఈవెంట్ పునఃప్రారంభమైంది. ఈ సెషన్‌లో ఆరంభంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల హవా సాగింది. మళ్లీ విదేశీ స్టార్ ప్లేయర్లు తెర మీదికి వచ్చారు. జోఫ్రా అర్చర్, డెవాన్ కాన్వే, డేనియల్ సామ్స్, మిఛెల్ శాంట్నర్ వంటి విదేశీ క్రికెటర్లు హట్ కేక్స్‌గా మారారు.

న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వేను కోటి రూపాయలకే చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరుంది కాన్వేకు. టెస్ట్ మ్యాచుల్లోనూ నిలకడను కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఇన్నింగ్ ఆడగల సామర్థ్యం కాన్వేకు ఉంది. భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌తో అతను ఇంటర్నేషల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. బ్లాక్ క్యాప్స్ టీమ్‌కు గెలుపుగుర్రంలా మారాడు. ఇప్పటిదాకా కాన్వే 20 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు.

అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 99 పరుగులు. స్ట్రైక్ రేట్ 139.35. మొత్తంగా 602 పరుగులు చేశాడు. 20 టీ20 ఫార్మట్ మ్యాచ్‌ల తరువాత కూడా అతని బ్యాటింగ్ యావరేజ్ 50కి పైగా ఉందంటే.. ఎంత నిలకడగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్‌లో సత్తా చాటాలంటే ఈ గణాంకాలు చాలు. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్‌లల్లోనూ కాన్వే అదే దూకుడును ప్రదర్శిస్తోన్నాడు. అయిదు టెస్టుల్లో 69.22 యావరేజ్‌తో 623 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది.

ఇప్పటిదాకా మూడే మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ ఆడాడు కాన్వే. ఓ సెంచరీ సహా 225 పరుగులు చేశాడు. అద్భుతమైన యావరేజ్, స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. వన్డేల్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 75. స్ట్రైక్ రేట్ 88.24గా నమోదైంది. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌‌కు పార్ట్‌నర్ దొరికినట్టే. న్యూజిలాండ్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న కాన్వే.. ఇక చెన్నైలోనూ ఇన్నింగ్‌ను ఆరంభించడం దాదాపు ఖాయమైనట్టే.

Story first published: Sunday, February 13, 2022, 16:34 [IST]
Other articles published on Feb 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+