MI vs KKR: హెడ్ టూ హెడ్ రికార్డ్సుల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ పూర్తి అధిపత్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు మరో ఆసక్తిర పోరు జరగబోతుంది. నేటి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పుణే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో హెడ్ టూ హెడ్ రికార్డులను ఒక సారి గమనిస్తే ముంబై ఇండియన్స్ జట్టే అధిపత్యం కనబర్చింది.
ముంబై అధిపత్యం
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ టూ హెడ్ రికార్డుల్లో ముంబై పూర్తి అధిపత్యాన్ని కనబర్చింది. రెండు జట్లు ఈ లీగ్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో తలపడగా ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా కేవలం 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఇరు జట్లు తలపడినప్పుడు ఓ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అత్యధికంగా 210 పరుగుల స్కోర్ చేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ 232 పరుగులు చేసింది. అత్యల్పంగా ముంబై 108 పరుగులు చేయగా.. కోల్‌కతా 67 పరుగులు చేసింది. రెండు జట్లు తలపడిన చివరి 5 మ్యాచ్‌ల్లో ముంబై 3, కోల్‌కతా 2 మ్యాచ్‌లు గెలిచింది.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, రిలే మెరెడిత్, రమణదీప్ సింగ్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ధి, అర్షద్ ఖాన్, డెవాల్డ్ బ్రీవిస్

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ నబీ, పాట్ కమిన్స్, షెల్డన్ జాక్సన్, చామికా కరుణరత్నే, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, ప్రథమ్ సింగ్, అభిజీత్ తోమర్, రసిఖ్ సలామ్, అమన్ హకీమ్ ఖాన్, అశోక్ శర్మ, రమేష్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications