For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: ట్రోఫిల్లోనే కాదు సిక్సుల్లోనూ ముంబైనే టాప్‌.. అత్య‌ధిక సిక్సులు బాదిన టీంల జాబితా ఇదిగో!

IPL 2022: Mumbai Indians top the list of teams with the most sixes in the IPL
IPL 2022: Most Sixes By Teams In IPL టాప్ లో MI, స‌న్‌రైజ‌ర్స్ ఏ ప్లేస్ లో ఉందంటే | Oneindia Telugu

క్రికెట్ అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 వ‌చ్చేసింది. మ‌రో 3 రోజుల్లోనే ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో బ్యాట‌ర్లు బాదే సిక్సులకు గిరాకీ మాములుగా ఉండ‌దు. ఆ సిక్సులే మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్దేశిస్తాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ముగిసిన ఐపీఎల్ సీజ‌న్ల‌న్నింటిలో అత్య‌ధిక సిక్సులు బాదిన టీం ఏద‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం సాగుతుంది.

టాప్‌లో ముంబై

టాప్‌లో ముంబై

ఇప్ప‌టికే ఐపీఎల్‌లో అత్య‌ధిక ట్రోఫీలు గెలిచిన రికార్డును త‌న పేరు మీద లిఖించుకున్న ముంబై ఇండియ‌న్స్.. అత్య‌ధిక సిక్సులు కొట్టిన ఘ‌న‌త‌ను కూడా త‌న పేరు మీద‌నే ఉంచుకుంది. ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జ‌ట్ల జాబితాలో ముంబై ఇండియ‌న్స్ టాప్ ప్లేసులో ఉంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ అత్య‌ధికంగా 1308 సిక్సులు బాదింది. అలాగే ఐపీఎల్‌లో అత్య‌ధికంగా ముంబై ఇండియ‌న్స్ 5 ట్రోఫీలు గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక 1275 సిక్సుల‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు రెండో స్థానంలో ఉంది. కాగా బెంగ‌ళూరు ప‌లుమార్లు ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా టైటిల్ గెలుచుకోలేక‌పోయింది.

మూడు, నాల్గో స్థానంలో ఆ టీంలు

మూడు, నాల్గో స్థానంలో ఆ టీంలు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1166 సిక్సులు బాదిన పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. అయితే ట్రోఫిని మాత్రం ఆ జ‌ట్టు ఒక్క సారి కూడా గెలుచుకోలేక‌పోయింది. ఒక సారి ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ర‌న్న‌ర‌ఫ్‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఈ జాబితాలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ నాల్గో స్థానంలో ఉంది. ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు 1165 సిక్సులు బాదింది. అలాగే మ‌హేంద్ర సింగ్ ధోని సార‌థ్యంలోని చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫిని గెలిచింది.

కేకేఆర్ స్థానం ఎంతంటే..

అత్య‌ధిక సిక్సులు కొట్టిన జ‌ట్ల జాబితాలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఐదో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్లు 1113 సిక్సులు బాదారు. ఇక ఐపీఎల్ ట్రోఫీని నైట్ రైడ‌ర్స్ రెండు సార్లు ముద్దాడింది. ఆ రెండు కూడా గౌతం గంభీర్ కెప్టెన్సీలోనే గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక 1041 సిక్సుల‌తో ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో ఉంది. కాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేక‌పోయింది. ఒక సారి ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ర‌న్న‌ర‌ఫ్‌తోనే స‌రిపెట్టుకుంది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్థానం ఇదే

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్థానం ఇదే

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 874 సిక్సులు బాదిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అత్య‌ధిక సిక్సులు కొట్టిన టీంలో జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్ మొద‌టి సీజ‌న్‌లోనే ట్రోఫీ గెలుచుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌రో సారి టైటిల్ గెల‌వ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత క‌నీసం ఒక్క సారి కూడా ఫైన‌ల్ కూడా చేర‌లేక‌పోయింది. ఇక 680 సిక్సుల‌తో ఈ జాబితాలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాళ్లు ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక సారి ట్రోఫీ గెలుచుకుంది. ఇక 400 సిక్సుల‌తో డెక్క‌న్ చార్జ‌ర్స్ తొమ్మిదో స్థానంలో, 196 సిక్సుల‌తో పుణే వారియ‌ర్స్ ఇండియా ప‌దో స్థానంలో, 157 సిక్సులతో రైజింగ్ పుణే సూప‌ర్ జెయింట్స్ ప‌ద‌కొండో స్థానంలో, 155 సిక్సుల‌తో గుజ‌రాత్ ల‌య‌న్స్ 12వ స్థానంలో, 53 సిక్సుల‌తో కొచ్చి ట‌స్క‌ర్స్ కేర‌ళ 13వ స్థానంలో ఉంది.

Story first published: Wednesday, March 23, 2022, 13:50 [IST]
Other articles published on Mar 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+