
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్‌లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవ్వాళ అభిమానులను ఆలరించనుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తోన్న ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. ఆల్‌రౌండర్లు, పించ్ హిట్టర్లతో నిండిన రోహిత్ సేనను సంజు శాంసన్ జట్టు ఎంత వరకు నిలువరించగలుగుతుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్ సేన స్థానం 9. కింది నుంచి రెండో స్థానంలో నిలిచిందీ టీమ్. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుని.. తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. గాయం వల్ల జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో రావడం ఖాయం. తుదిజట్టులో అతనికి స్థానం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.
వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అతని వేలికి గాయమైంది. ఎముక చిట్లింది. దీనితో సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలేట్ అయ్యాడు. విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ఫిట్‌నెస్‌ను సాధించినట్లు మేనేజ్‌మెంట్ చెబుతోంది. అవసరమౌతుందని ఎన్సీఏ చెబుతోంది. అతను జట్టుతో చేరితు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై సానుకూల ప్రభావం పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించనుంది.. ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్. తుది జట్టులోకి అతని చేరిక ఖాయమైనట్టే. ఈ సీజన్‌లో నిర్వహించిన మెగా వేలంపాట సందర్భంగా అత్యధిక ధరను పలికిన ప్లేయర్ ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌కు బ్యాక్‌బోన్‌గా ఉంటోన్నాడు. ఇషాన్ కిషన్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటోన్నాయి. జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు. ఢిల్లీ కేపిటల్స్‌పై విజృంభించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తాడని మేనేజ్‌మెంట్ నమ్ముతోంది.
కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఆల్‌రౌండర్లలో టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, టైనల్ మిల్స్, బాసిల్ థంపీ రాజస్థాన్ రాయల్స్‌పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టులో- జోస్ బట్లర్, యశశ్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్ ప్లస్ వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నీల్ లేదా జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ ఆడే అవకాశం ఉంది.