Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ముంబై ఇండియ‌న్స్‌కు బంపర్ ఆఫర్.. కొత్త‌గా స్పిన్న‌ర్ అవ‌తారం ఎత్తిన కీర‌న్ పొలార్డ్‌

IPL 2022: Mumbai Indians all-rounder Kieron Pollard takes a wicket off spin bowling in the T10 Blast 2022

వెస్టిండీస్ కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ కీర‌న్ పొలార్డ్ స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. మంచి ఆల్‌రౌండ‌ర్ అయిన పొలార్డ్ బ్యాటింగ్‌పాటు మీడియం పేస్ బౌలింగ్‌తో త‌న జ‌ట్లకు ఎన్నో విజ‌యాలు అందించాడు. ఇక పొలార్డు ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. ప్ర‌పంచంలోని గొప్ప ఫీల్డ‌ర్ల‌లో ఒక్క‌డిగా పొలార్డుకు పేరు ఉంది.

స్పిన్న‌ర్ అవ‌తారంలో

స్పిన్న‌ర్ అవ‌తారంలో

అటువంటి కీర‌న్‌ పొలార్డ్ త‌న క్రికెట్ కెరీర్లో ఎన్న‌డు లేని కొత్త విధంగా తొలి సారి స్పిన్ బౌలింగ్ వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఎన్న‌డూ లేనిది కొత్తగా స్పిన్ బౌలింగ్ వేయ‌డమే కాకుండా ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. అస‌లు ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందంటే ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్ 2022లో ఈ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్ ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

వికెట్ తీసిన పొలార్డ్‌

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్, సోకా కింగ్‌ల మధ్య మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన తర్వాత ఐబిస్ స్కార్చర్స్ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్‌ సోకా కింగ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక ఇన్నింగ్స్ నాల్గో ఓవ‌ర్‌ను పొలార్డ వేశాడు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ స్పిన్ బౌలింగ్ వేశాడు. స్పిన్ బౌలింగ్ వేయ‌డమే కాకుండా ఆ ఓవ‌ర్లో 10 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. ఆ మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే వేశాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీంతో ముంబై ఇండియ‌న్స్‌కు కొత్త స్పిన్న‌ర్ దొరికేశాడంటూ నెటిజ‌న్సు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ముంబై ఇండియ‌న్స్‌కు బంప‌ర్ ఆఫర్ అంటూ మ‌రికొంద‌రు అంటున్నారు.

పొలార్డ్‌ జ‌ట్టు ఓట‌మి

పొలార్డ్‌ జ‌ట్టు ఓట‌మి

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన సోకా కింగ్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అయితే ఆ త‌ర్వాత వ‌ర్షం రావ‌డంతో ఓవర్లను కుదించారు. ఐబిస్ స్కార్చర్స్ టార్గెట్‌ను 8 ఓవ‌ర్ల‌లో 122 ప‌రుగులుగా నిర్ణ‌యించారు. కానీ ఆ టార్గెట్‌ను చేధించ‌డంలో స్కార్చ‌ర్స్ విఫ‌లమైంది. ఆ జ‌ట్టు 8 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 80 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం స్కార్చ‌ర్స్ 42 పరుగుల‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ 8 ప‌రుగులు మాత్రమే చేశాడు.

ముంబైకి ప్రాతినిధ్యం

ముంబైకి ప్రాతినిధ్యం

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్‌కే ప్రాతినిధ్యం వ‌హించిన కీర‌న్ పొలార్డ్ ఈ సారి కూడా అదే జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. ఈ సారి మెగా వేలానికి ముందే పొలార్డ్‌ను ముంబై రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 178 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 29 స‌గ‌టుతో 3268 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 87 ప‌రుగులుగా ఉంది. ఇక అదే స‌మ‌యంలో పొలార్డ్ 65 వికెట్లు కూడా తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/44గా ఉన్నాయి.

Story first published: Tuesday, March 1, 2022, 11:18 [IST]
Other articles published on Mar 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+