
ప్రాక్టీసులో ఆర్చర్
మైదానంలో జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి చేతిలో బ్యాట్‌తో ప్రవాహం, టాప్ గేర్‌లో మిమ్మల్ని చూడడానికి వేచి ఉండలేం అంటూ రాసుకొచ్చింది. అయితే అతను ఈ సీజన్లో ఆడతాడా? లేదా? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ముంబై ఇండియన్స్ చేసిన ఈ ట్వీట్‌ను, వీడియోను బట్టి ఆర్చర్ ఈ సీజన్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. టోర్నీ మొత్తం కాకపోయినా సెకండాఫ్‌లోనైనా జోఫ్రా ఆర్చర్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. గాయం కారణంగా చాలా రోజులకు ఈ స్టార్ ఆల్‌రౌండర్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయతే తాజా వీడియోను చూస్తే గాయం నుంచి ఆర్చర్ కోలుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

జోఫ్రా ఆర్చర్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన జోఫ్రా ఆర్చర్ 46 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/15గా ఉన్నాయి. ఇక బ్యాటింగ్‌లో 195 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 27 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో 11 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. కాగా ఐపీఎల్ ఆర్చర్ గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు 2022
రోహిత్ శర్మ (16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (12 కోట్లు), కీరన్ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (8 కోట్లు), ఇషాన్ కిషన్ (15.25 కోట్లు), టిమ్ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్ (ఓవర్సీస్-3 కోట్లు), డేనియల్ సామ్స్ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్ వర్మ(1.70 కోట్లు), మురుగన్ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్ మిల్స్ (ఓవర్సీస్-1.50 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్ మార్కండే ( 65 లక్షలు), సంజయ్ యాదవ్ (50 లక్షలు), బసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్ (వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications












