IPL 2022: టీమిండియా స్పిన్న‌ర్లు అశ్విన్, చాహ‌ల్, కుల్దీప్‌పై ఆ 3 టీంల క‌న్ను! ధ‌ర ఎంతంటే..

స‌రిగ్గా మ‌రో మూడు రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జ‌ర‌గబోతుంది. 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మెగా వేలానికి ఇప్ప‌టికే బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఇక ఫ్రాంచైజీలు కూడా వేలంలో అనుస‌రించాల్సిన త‌మ వ్యూహాల‌తో సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి వేలంలో అత్య‌ధికంగా 10 ఫ్రాంచైజీలు పాల్గొన‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వేలంలో ముగ్గురు టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ల‌పై మూడు ఫ్రాంచైజీలు ప్ర‌ధానంగా దృష్టి సారించాయ‌ని స‌మాచారం.

ఆ 3 ఫ్రాంచైజీల క‌న్ను

ఆ 3 ఫ్రాంచైజీల క‌న్ను

ప్ర‌స్తుతం టీమిండియాలో రాణిస్తున్న వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తోపాటు యువ స్పిన్న‌ర్లు యుజుర్వేంద్ర చాహ‌ల్, కుల్దీప్ యాద‌వ్ ఐపీఎల్ మెగా వేలంలో క్రేజీగా మారారు. వీరి ముగ్గురిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌ధానంగా 3 ప్రాంచైజీలు ఆస‌క్తి చూపుతున్నాయ‌ని స‌మాచారం. అవి చెన్నైసూప‌ర్‌కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌గా తెలుస్తోంది. వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను వేలంలో కొనుగోలు చేయాల‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆస‌క్తిగా ఉంద‌ని సమాచారం. చాహ‌ల్‌ను వేలంలో ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక కుల్దీప్ యాద‌వ్‌ను కొనుగోలు చేయ‌డానికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆస‌క్తి క‌న‌బరుస్తోంద‌ని తెలుస్తోంది.

 రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

గ‌త సీజ‌న్లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు, య‌జుర్వేంద్ర చాహ‌ల్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు, కుల్దీప్ యాద‌వ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. కానీ ఈ సారి ఆ జ‌ట్ల‌ రిటెన్ష‌న్ జాబితాలో వీరి ముగ్గురికి చోటు ద‌క్క‌లేదు. దీంతో మెగా వేలంలో పాల్గొననున్నారు. ప్ర‌స్తుతం వీరు ముగ్గురు కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అలాగే విజ‌య‌వంతంగా రాణిస్తున్నారు. దీంతో వీరు త‌మ జ‌ట్టులో ఉంటే త‌మ స్పిన్ విభాగం బ‌ల‌ప‌డుతుంద‌ని ఆయా ఫ్రాంచైజీలు భావిస్తున్నాయ‌ని సమాచారం.

రికార్డులు

రికార్డులు

27 ఏళ్ల కుల్దీప్ యాద‌వ్ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 45 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4-20గా ఉన్నాయి. ఇక 35 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 167 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4-34గా ఉన్నాయి. 31 ఏళ్ల య‌జుర్వేంద్ర చాహ‌ల్ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 114 మ్యాచ్‌లు ఆడి 139 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4-25గా ఉన్నాయి.

 ధ‌ర ఎంతంటే..

ధ‌ర ఎంతంటే..

2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో మెగా వేలంలో ఉన్న చాహ‌ల్‌పై ముంబై ఇండియ‌న్స్ క‌న్నేసింది. ప్ర‌స్తుతం చాహ‌ల్ సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌డంతో 6 కోట్ల రూపాయ‌ల నుంచి 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వెచ్చించి కొనుగోలు చేయ‌డానికి ఆ జ‌ట్లు ఆస‌క్తి క‌నుబరుస్తుంద‌ని స‌మాచారం. ఇక 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్న వెట‌ర‌న్ స్పిన్న‌ర్ అశ్విన్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌న్నేసింది. అశ్విన్ కోసం చెన్నై 5 నుంచి 8 కోట్ల రూపాయ‌లు కేటాయించి కొనుగోలు చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఇక కోటి రూపాయ‌ల బేస్‌ప్రైజ్‌తో ఉన్న కుల్దీప్ యాద‌వ్‌ను కొనుగోలు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భావిస్తోంద‌ని స‌మాచారం. కుల్దీప్ కోసం స‌న్‌రైజ‌ర్స్ 5 కోట్ల రూపాయ‌ల నుంచి 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వెచ్చించి కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, February 8, 2022, 14:59 [IST]
Other articles published on Feb 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X