Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: వేలంలో జేస‌న్ రాయ్‌ను క్రేజీగా మార్చేసిన పీఎస్ఎల్ సెంచ‌రీ.. ఆ మూడు జట్లు క‌న్ను!

IPL 2022: Mumbai and Bangalore and Sunrisers are vying to buy Jason Roy in a mega auction.

బెంగ‌ళూరు: మెగా వేలానికి స‌రిగ్గా మ‌రో 3 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దీంతో వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆట‌గాళ్లపై ఫ్రాంచైజీలు ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. అయితే గ‌త రికార్డుల‌ను కాకుండా ప్ర‌స్తుత ఫాంను దృష్టిలో పెట్టుకుని ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దీంతో ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌తోపాటు ప‌లు లీగ్‌ల్లో స‌త్తా చాటుతున్న ఆట‌గాళ్ల‌పై దృష్టి పెట్టాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో స‌త్తా చాటిన ఓ ఆట‌గాడిపై మూడు ప్ర‌ధాన జ‌ట్లు దృష్టి సారించాయ‌ని స‌మాచారం.

 జేస‌న్ రాయ్ సెంచ‌రీ

జేస‌న్ రాయ్ సెంచ‌రీ

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ చెల‌రేగాడు. ఏకంగా సెంచ‌రీతో విశ్వ‌రూపం చూపించాడు. పీఎస్ఎల్‌లో రాయ్.. క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో సోమ‌వారం లాహోర్ ఖ‌లాండ‌ర్స్‌తో క్వెట్టా గ్లాడియేటర్స్ త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలాండర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 204 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అనంత‌రం 205 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ జేస‌న్‌రాయ్ విధ్వంసం సృష్టించ‌డంతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న రాయ్ 11 ఫోర్లు, 8 సిక్సుల‌తో 116 ప‌రుగుల‌తో విధ్వంసం సృష్టించాడు. రాయ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ పీఎస్ఎల్‌లోనే గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒక‌టిగా నిలిచిపోయింది.

రాయ్‌పై మూడు జ‌ట్లు క‌న్ను

రాయ్‌పై మూడు జ‌ట్లు క‌న్ను

జేస‌న్ రాయ్ ఆడిన ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఈ శ‌నివారం, ఆదివారం బెంగళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మెగావేలంలో అత‌న్ని క్రేజీగా మార్చేసింది. దీంతో అత‌ని కోసం వేలంలో మూడు ప్ర‌ధాన జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయ‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం వేలంలో రాయ్‌ను ద‌క్కించుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు భావిస్తున్నాయ‌ట‌. ఇందుకోసం ప్ర‌త్యేక ప్రణాళిక‌ల‌ను కూడా రూపొందించాయ‌ని స‌మాచారం.

 గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం

గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం

ఐపీఎల్‌లో 2017 నుంచి ఆడుతున్న‌ జేస‌న్‌రాయ్ గ‌త ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ రిటెన్ష‌న్ జాబితాలో రాయ్‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో అత‌ను మెగా వేలంలో పాల్గొన‌నున్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 29 స‌గ‌టుతో 329 ప‌రుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకోగా అత్య‌ధిక స్కోర్ 91 ప‌రుగులు.

IPL 2022 Mega Auction: Sunrisers Hyderabad Probable Squad, SRH పూర్తి జట్టు అంచనా | Oneindia Telugu
ఎంత ధ‌ర ఉంటే

ఎంత ధ‌ర ఉంటే

ఐపీఎల్ మెగా వేలంలో జేస‌న్ రాయ్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. పీఎస్ఎల్‌లో సూప‌ర్ సెంచ‌రీతో రాయ్‌పై ఇప్పటికే ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క‌న్నేశాయి. దీంతో ప్ర‌స్తుతం రాయ్‌ ఉన్న ఫామ్ దృశ్యా అత‌ను 5 కోట్ల రూపాయ‌ల నుంచి 8 కోట్ల రూపాయ‌ల ధ‌ర ప‌లుకుతాడ‌ని క్రీడా విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

Story first published: Tuesday, February 8, 2022, 14:28 [IST]
Other articles published on Feb 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+