Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: పంజాబ్‌పై ధోనికి అదిరిపోయే రికార్డులు.. నేటి మ్యాచ్‌లోనూ దుమ్ములేప‌డం ఖాయం

IPL 2022: MS Dhoni vs PBKS- MS Dhoni Made 607 runs with 55 average

ఐపీఎల్ 2022లో మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజ‌న్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని ఒక సారి కూడా ఔట్ కాలేదు. అంతేకాకుండా సూప‌ర్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడిన ఆరంభ మ్యాచ్‌లో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి వ‌చ్చిన ధోని 38 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచ‌రీ కొట్టి ఆదుకున్నాడు. ఇక ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో 6 బంతుల్లోనే 16 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లోనూ ధోని త‌న ఫామ్‌ను కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ధోని వ‌ర్సెస్ పంజాబ్‌

ధోని వ‌ర్సెస్ పంజాబ్‌

ఐపీఎల్‌లో మ‌హేంద్ర సింగ్ ధోనికి పంజాబ్ కింగ్స్‌పై మంచి రికార్డులు ఉన్నాయి. ఈ లీగ్‌లో పంజాబ్‌తో ఇప్పటివ‌ర‌కు 27 మ్యాచ్‌లు ఆడ‌న ధోని 22 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 55 స‌గ‌టుతో 607 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 152గా ఉంది. 5 సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్ అందుకోగా.. అత్య‌ధిక స్కోర్ 79 ప‌రుగులు నాటౌట్‌గా ఉంది.

ధోని రికార్డులు

ధోని రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌రకు 222 మ్యాచ్‌లాడిన ధోని 40 స‌గ‌టుతో 4812 ప‌రుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 84 ప‌రుగులుగా ఉంది. 136 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో 334 ఫోర్లు, 221 సిక్సులు బాదాడు. ఇప్ప‌టికే 40 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ధోని ఇదే చివ‌రి సీజ‌న్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ సీజ‌న్‌లో ధోని సీఎస్కే కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఈ సీజ‌న్‌లో చెన్నై కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజా ఉన్నాడు.

గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి

గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి

ఇప్ప‌టికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నైసూప‌ర్ కింగ్స్ నేడు గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నున్న‌ మ్యాచ్‌లో గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సీజ‌న్‌లో బోణి చేయాల‌ని భావిస్తోంది. జ‌ట్టు బ్యాటింగ్ యూనిట్ రాణిస్తున్న బౌలింగ్ యూనిట్ రాణించ‌క పోవ‌డం ఆ జ‌ట్టుకు మైన‌స్‌గా మారింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ఆడిన చివ‌రి మ్యాచ్‌లో అయితే ఆ జ‌ట్టు 200కు పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా కాపాడుకోలేక‌పోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో బౌల‌ర్ల నుంచి సీఎస్కే మేనేజ్‌మెంట్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఆశిస్తోంది.

తుది జ‌ట్లు (అంచ‌నా)

తుది జ‌ట్లు (అంచ‌నా)

చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రాబిన్ ఊత‌ప్ప‌, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, అంబ‌టి రాయుడు, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్), మ‌హేంద్ర సింగ్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్‌.

పంజాబ్ కింగ్స్‌: మ‌యాంక్ అగ‌ర్వాల్, శిఖ‌ర్ ధావ‌న్, బెయిర్‌స్టో, భానుక రాజ‌ప‌క్స, రాజ్ బవా, షారూక్ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియ‌న్ స్మిత్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో రబాడ‌, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, April 3, 2022, 18:10 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+