For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. ఫిట్‌నెస్ కా బాప్: ఆ స్టంపౌట్ నుంచి తప్పించుకున్న తీరుకు ఫిదా: ఆ ఏజ్‌లో హాఫ్ సెంచరీ

IPL 2022: MS Dhoni Is The Oldest Player To Hit Half Century

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్ క్రికెట్ ప్రేమికుల ముందుకొచ్చేసింది. 65 రోజుల పాటు ఉర్రూతలూగించనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌పై ఉన్న అంచనాలు తప్పాయి. గ్రౌండ్‌లో పరుగుల వరద పారుతుందని భావించిన అభిమానులకు నిరాశ పరిచిందీ మ్యాచ్. బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారి దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగారు.

 ధోనీ మెరుపులు..

ధోనీ మెరుపులు..

టాస్ ఓడిపోయి.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్- నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులే చేయగలిగింది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహేంద్రసింగ్ ధోనీ మెరుపులు మెరిపించకపోతే.. ఆ స్కోర్ కూడా కష్టం అయ్యేదే. తన శైలికి భిన్నంగా తొలి మ్యాచ్‌లోనే ధోనీ చెలరేగిపోయాడు. 38 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇదే మొదటిది. రాబిన్ ఊతప్ప, కేప్టెన్ రవీంద్ర జడేజా మినహా మరెవరూ రాణించలేకపోయారు.

మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా..

మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా..

మ్యాచ్ పోతే పోయింది గానీ.. మహేంద్రుడి బ్యాటింగ్ మాయాజాలాన్ని చూసే ఛాన్స్ లభించింది ఫ్యాన్స్‌కు. ఈ ఐపీఎల్ సీజన్.. తొలి మ్యాచ్, తొలి ఇన్నింగ్‌లోనే రెచ్చిపోయాడు తలైవా. తనకు మాత్రమే సొంతమైన షాట్లతో ప్రేక్షకులను వెర్రెక్కించాడు. 131.57 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ సాగింది. 38 బంతుల్లో 50 పరుగులను ఊదేశాడు. ఏడు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. ఓ భారీ సిక్స్‌తో తన ఫిట్‌నెస్ సత్తా ఎలాంటిదో చాటి చెప్పాడు.

17 బంతుల తరువాత తొలి ఫోర్..

17 బంతుల తరువాత తొలి ఫోర్..

క్రీజ్‌లో దిగిన తరువాత చాలాసేపటి వరకు ధోనీ బ్యాట్ నుంచి షాట్లు జాలువారలేదు. ఒక దశలో అతను 17 బంతుల్లో చేసిన పరుగులు ఏడు మాత్రమే. ఉమేష్ యాదవ్ వేసిన 16వ ఓవర్‌ మూడో బంతిని బౌండరీకి పంపించాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్‌లో 49 బంతులు తరువాత రికార్డయిన తొలి ఫోర్ అది. ఆ తరువాత కూడా చెన్నై బ్యాటింగ్ పుంజుకోలేదు. సునీల్ నరైన్ వేసిన 17వ ఓవర్‌లోనూ మూడు పరుగులే వచ్చాయి.

చివరి మూడు ఓవర్లలో ప్రతాపం..

చివరి మూడు ఓవర్లలో ప్రతాపం..

చివరి మూడు ఓవర్లలో ఎన్ని పరుగులను పిండుకోవాలో.. అన్నీ పిండుకున్నాడు ధోనీ. 18వ ఓవర్‌లో ఫోర్లు బాదాడు. ఆ ఓవర్‌లో మూడుసార్లు బంతిని బౌండరీ దాటించాడు. శివం మావి వేసిన ఆ తరువాతి ఓవర్‌లో బ్యాక్ అండ్ బ్యాక్ కళ్లు చెదిరిపోయే షాట్స్ ఆడాడు. నో బాల్‌గా వేసిన ఆరోబంతిని సిక్స్‌గా మలిచాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించాడు. మూడు, నాలుగు బంతులను బౌండరీలుగా మలిచాడు.

ఆ స్టంపౌట్ నుంచి..

ఆ స్టంపౌట్ నుంచి..

18వ ఓవర్‌లో స్టంపవుట్ నుంచి ధోనీ బయటపడిన తీరు అతని ఫిట్‌నెస్‌కు అద్దం పట్టింది. బంతిని ఆడబోయి మిస్ అయ్యాడు. అది వికెట్ కీపర్ చేతుల్లో వాలింది. ధోనీ క్రీజ్ నుంచి కుడిని కాలిని కూడా గాల్లోకి లేపాడని భావించిన కీపర్.. బెయిల్స్ ఎగురగొట్టాడు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. అవుట్ అయ్యే క్షణం అది. కీపర్ అంచనాలు తప్పాయి. పాదాన్ని క్రీజ్‌లోనే ఉంచి ధోనీ.. తనను తాను బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం. ధోనీ ఫిట్‌నెస్‌ కా బాప్ అనిపించిందీ ఫీట్.

Story first published: Sunday, March 27, 2022, 10:38 [IST]
Other articles published on Mar 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+