
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మరో 3 సిక్సులు కొడితే ఈ లీగ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టిస్తాడు. సీఎస్కే తరఫున ధోని ఇప్పటివరకు 217 సిక్సులు కొట్టాడు. చెన్నై తరఫున ఐపీఎల్‌లో 191 సిక్సులు కొట్టిన ధోని.. ఛాంపియన్స్ లీగ్‌లో మరో 26 సిక్సులు బాదాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌తో నేడు చెన్నైసూపర్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌లోనే ధోని ఈ రికార్డు చేరుకోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. కాగా చెన్నైసూపర్ కింగ్స్ తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు సురేష్ పేరు మీద ఉంది. రైనా ఇప్పటివరనకు 219 సిక్సులు బాదాడు. ఇక ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 263 సిక్సులు బాదాడు.
అలాగే ఈ మూడు సిక్సుల ద్వారా టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్‌ను అధిగమించి ధోని 27వ స్థానానికి చేరుకుంటాడు. ఇప్పటివరకు 349 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని 307 సిక్సులు కొట్టాడు. ఇంకొక మ్యాచ్ ఆడితే 350 టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా భారత్ తరఫున 350 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా ధోని నిలుస్తాడు. 371 టీ20 మ్యాచ్‌లతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెదటి స్థానంలో ఉన్నాడు. అలాగే అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని 19వ స్థానానికి చేరుకుంటాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 11వ స్థానంలో ఉన్నాడు.

తుది జట్లు (అంచనా)
చెన్నైసూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, భానుక రాజపక్స, రాజ్ బవా, షారూక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియన్ స్మిత్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.