Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: మ్యాచ్ ముగిశాక ధోనీ, స్టెయిన్ మధ్య వాటే మూమెంట్.. సోషల్ మీడియాలో వైరల్

IPL 2022: MS Dhoni Gives Autograph To Dale Steyn After SRH Match

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓపెనింగ్ జోడీ ఈ సీజన్‌లో అత్యుత్తమంగా 182పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరచడంతో 202పరుగుల భారీ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను 13పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలుగుతున్న ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీని తిరిగి ఎంఎస్ ధోనీకి జడేజా అప్పగించాడు. దీంతో ఆదివారం నాటి మ్యాచ్‌లో ధోనీ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం ధోనీ, సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గ్రౌండ్లోకి వస్తుండగా.. ధోనీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోనీకి తిరిగి కెప్టెన్‌గా అద్భుత స్వాగతం లభించింది. రెండు సంవత్సరాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీకి ఇప్పటికీ ఎనలేని ప్రేక్షకాదరణ ఉంది. ఇండియాలోనే భారీ క్రౌడ్ పుల్లర్‌గా ధోనీని అభివర్ణిస్తుంటారు.

వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ధోనీ గ్రౌండ్లో అడుగుపెడుతున్నాడంటే.. ఆ స్టేడియంలో ఉండే ఫ్యాన్స్‌లో ధోనీ అభిమానులే ఎక్కువ ఉంటారు. అంతటి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ధోనీకి ఉందనేది జగమెరిగిన సత్యం. ఇక నిన్నటి మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ ఎంఎస్ ధోనీని కలిశాడు. ధోనీ నుంచి జెర్సీపైన ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. స్టెయిన్‌కు ధోనీ ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫోటో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



ఇకపోతే డేల్ స్టెయిన్ ప్రస్తుతం సన్ రైజర్స్ ప్రధాన కోచ్ టామ్ మూడీ, బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా, స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌లతో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్-స్టడెడ్ కోచింగ్ స్టాఫ్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని అమూల్యమైన సలహాలతో సన్ రైజర్స్ పేస్ విభాగం చాలా పటిష్ఠంగా కన్పిస్తోంది. ఉమ్రాన్ మాలిక్ అయితే వరుసగా అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

నటరాజన్ సైతం యార్కర్లు, బౌలింగ్ వేరియేషన్లతో వికెట్లు తీస్తున్నాడు. ఇక డేల్ స్టెయిన్ ఐపీఎల్లో ఎన్నో సీజన్లు ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల తరఫున ఆడి రాణించాడు. తన ఐపీఎల్ కెరీర్లో స్టెయిన్ మొత్తం 95మ్యాచ్‌లు ఆడి 97వికెట్లు తీశాడు. అతని ఎకానమీ 6.92కావడం విశేషం. ఇక అంతర్జాతీయంగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా డేల్ స్టెయిన్ పేరొందాడు.

Story first published: Monday, May 2, 2022, 9:51 [IST]
Other articles published on May 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+