Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: మైండ్ ఎక్కడ పెట్టి బౌలింగ్ చేస్తున్నావ్ ముఖేష్.. సీరియస్ అయిన ధోనీ

IPL 2022: MS Dhoni Gets Angry Over Mukesh Choudhary For Wide Ball In The Last Over With SRH

ఎంఎస్ ధోనీ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆదివారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 13పరుగుల తేడాతో చెన్నై ఓడించిన సంగతి తెలిసిందే. ధోనీ కెప్టెన్సీతో సీఎస్కే మళ్లీ విజయాల బాట పట్టింది. కాగా తిరిగి కెప్టెన్సీ వహించిన ధోనీ గతంలో కంటే.. కాస్త హడావుడిగా కన్పించాడు. అలాగే కొంత సీరియస్ అప్రోచ్ ధోనీ మ్యాచ్‌ను డీల్ చేశాడు. ఒక దశలో ధోనీ బరస్ట్ అయిపోయాడు. సన్ రైజర్స్ ఛేజింగ్ చివరి ఓవర్‌లో చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి లెగ్ సైడ్ వైడ్ వేశాడు. దీంతో ధోనీ కోప్పడ్డాడు.

అప్పటికే మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక చివరి ఓవర్లో సన్ రైజర్స్ 38పరుగులు చేయాలి. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టినా సన్ రైజర్స్ గెలవలేదు. క్రీజులో నికోలస్ పూరన్ ఉన్నాడు. చివరి ఓవర్‌ను ధోనీ ముఖేశ్‌కు అప్పజెప్పాడు. ఆ ఓవర్ మూడో బంతి వేసే క్రమంలో నికోలస్ పూరన్‌కి లెగ్ సైడ్ వైపు బాల్ పడింది. దాంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. దీంతో వెనకాల కీపింగ్ చేస్తున్న ధోనీ కాస్త అసహనానికి లోనయ్యాడు. ధోనీ ముఖేష్ వైపు చూస్తూ.. ఆఫ్‌సైడ్‌లో అంతమంది ఫీల్డర్‌లను పెట్టాను. అయినా ఎందుకు లెగ్ సైడ్ వేస్తున్నావ్.. మైండ్ పెట్టి బౌలింగ్ చేయ్ అన్నట్లు సీరియస్‌గా సైగలు చేశాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా బాల్ విసురు.. వైడ్ పోయినా పర్లేదు కానీ లెగ్ సైడ్ నిన్ను ఎవరేయమన్నారు అన్నట్లు ధోనీ సీరియస్ ఫేస్ పెట్టాడు.

ఇక విషయమై ముఖేష్ చౌదరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'ధోనీ నాకు ఆ ఓవర్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు, అతను కేవలం స్టంప్‌ టూ స్టంప్‌ బౌల్ చేయమని మాత్రమే చెప్పాడు. ఏదైనా కొత్తగా మాత్రం అస్సలు ప్రయత్నించొద్దని సూచించాడు.' అని ముఖేష్ పేర్కొన్నాడు. ఇక ఆఖరి ఓవర్లో ముఖేశ్ 24పరుగులు ఇచ్చాడు. కాకపోతే అంతకుముందు మంచి బౌలింగ్ వేశాడు. ఓవరాల్‌గా ముఖేష్ నాలుగు ఓవర్లలో 46పరుగులు ఇచ్చి 4వికెట్లు పడగొట్టి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్ అనంతరం ధోనీ బౌలర్లకు పలు సజెషన్స్ ఇచ్చాడు. హైస్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఒక ఓవర్లో 3, 4సిక్సర్లు వచ్చినా సరే.. మిగతా బంతులను డిఫెండ్ చేయగలగడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపాడు. ఎవరైనా టీ20క్రికెట్లో హిట్టింగ్ చేయాలనే చూస్తారు.. బౌండరీలు ఇచ్చినంత మాత్రాన.. బౌలింగ్ లయ దెబ్బతినకుండా బంతులు వేయాలని.. యంగ్ ప్లేయర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు.

Story first published: Monday, May 2, 2022, 11:44 [IST]
Other articles published on May 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+