Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: CSK vs KKR మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు, వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితా ఇదే!

IPL 2022: Most runs and Wickets list in Kolkata knight riders vs Chennai super kings matches in IPL
IPL 2022: Most Runs And Most Wickets In CSK VS KKR Matches In IPL | Oneindia Telugu

క్రికెట్ అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర‌ల్ లీగ్ (ఐపీఎల్‌) 2022కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మరికాసేప‌ట్లో ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌, మాజీ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డనున్నాయి. ఈ జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు త‌ల‌ప‌డిన మొత్తం మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక వికెట్లు తీసిన‌ ఆట‌గాడెవ‌ర‌నేది ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

 టాప్‌లో రైనా

టాప్‌లో రైనా

ఐపీఎల్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డిన మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మిస్ట‌ర్ ఐపీఎల్ సురేష్ రైనా మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో దాదాపు అన్ని సీజ‌న్లు చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫునే ఆడిన సురేష్ రైనా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై 610 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత 442 ప‌రుగుల‌తో సీఎస్కే మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని రెండో స్థానంలో ఉండ‌గా.. సీఎస్కే త‌ర‌ఫునే ఆడిన ఫాప్ డుప్లిసెస్ 423 పరుగుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

ఊత‌ప్ప స్థానం ఎంతంటే..

ఈ జాబితాలో రాబిన్ ఊత‌ప్ప నాల్గో స్థానంలో ఉన్నాడు. ఊత‌ప్ప 310 ప‌రుగులు చేశాడు. కాగా ఐపీఎల్‌లో ఊత‌ప్ప గ‌తంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున ఆడ‌గా.. ప్ర‌స్తుతం చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. ఇక గ‌తంలో కోల్‌క‌తాకు ప్రాతినిధ్యం వ‌హించిన బ్రెండన్ మెకల్లమ్ ఐదో స్థానంలో ఉన్నాడు. మెక‌ల్ల‌మ్ సీఎస్కేపై 285 ప‌రుగులు చేశాడు. ఇక అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోర్ విష‌యానికొస్తే ఈ లిస్ట్‌లో ఫాఫ్ డుప్లిసెస్ మొదటి స్థానంలో ఉన్నాడు. సీఎస్కే త‌ర‌ఫున కేకేఆర్‌పై డుప్లిసెస్ 95 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇక రెండో స్థానంలో మన్విందర్ బిస్లా ఉన్నాడు. అత‌ను కేకేఆర్ త‌ర‌ఫున సీఎస్కేపై 92 ప‌రుగులు చేశాడు.

అత్య‌ధిక వికెట్లు ఎవ‌రికంటే..

అత్య‌ధిక వికెట్లు ఎవ‌రికంటే..

కేకేఆర్ వ‌ర్సెస్ సీఎస్కే మ్యాచ్‌ల‌లో అత్య‌ధిక వికెట్ల జాబితాలో సునీల్ న‌రైన్‌ మొద‌టి స్థానంలో ఉన్నాడు. న‌రైన్ ఇప్ప‌టివ‌ర‌కు 20 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో ప్ర‌స్తుతం సీఎస్కే కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా 18 వికెట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పీయూష్ చావ్లా 10, ర‌సూల్ 8 వికెట్లు తీశారు. అత్య‌త్త‌మ వ్య‌క్తిగ‌త గ‌ణాంకాలు ప‌వ‌న్ నెగి పేరు మీద ఉన్నాయి. అత‌ను ఒక సారి సీఎస్కే త‌ర‌ఫున కేకేఆర్‌పై 22 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

 హెడ్ టూ హెడ్ రికార్డులు

హెడ్ టూ హెడ్ రికార్డులు

ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు 26 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెన్నై రికార్డు స్థాయిలో 17 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించ‌గా.. కోల్‌క‌తా 8 మ్యాచ్‌ల్లో మాత్ర‌మే నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. ఐపీఎల్‌లో ఫైన‌ల్‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌రకు రెండు సార్లు త‌ల‌ప‌డ‌గా.. ఒక సారి కోల్‌క‌తా, మ‌రో సారి చెన్నై గెలిచాయి. కాగా గ‌తేడాది జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, March 26, 2022, 15:53 [IST]
Other articles published on Mar 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+