For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఒక‌ప్పుడు అత్య‌ధిక వికెట్ల వీరుడు.. ఇప్పుడేమో నెట్ బౌల‌ర్‌.. బ్యాడ్‌ల‌క్ అంటే మోహిత్ శ‌ర్మ‌దే!

IPL 2022: Mohit Sharma selected as Gujarat Titans net bowler
IPL 2022: Mohit Sharma Downfall - From Purple Cap Holder To Net Bowler | Oneindia Telugu

ఐపీఎల్‌లో ఒక‌ప్పుడు అత‌ను స్టార్ బౌల‌ర్‌గా చ‌క్రం తిప్పాడు. త‌న బౌలింగ్‌తో బ్యాట‌ర్ల‌కు చ‌మ‌ట‌లు చెప్పాడు. అత్య‌ధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. వ‌న్డే, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం కూడా వ‌హించాడు. కానీ ఇంత‌లోనే సీన్ రివ‌ర్స్ అయింది. ఐపీఎల్ మెగా వేలంలో అత‌డిని కొనే జ‌ట్టే కరువైపోయింది. దీంతో చేసేదేమి లేక ఘ‌న‌మైన రికార్డులున్న ఆ స్టార్ బౌల‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఓ జ‌ట్టుకు నెట్ బౌల‌ర్‌గా మారిపోయాడు. అత‌నెవ‌రో కాదు స్టార్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌. 33 ఏళ్ల మోహిత్ శ‌ర్మ ఐపీఎల్‌లో ప‌లు జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2014 సీజ‌న్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచి ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఆ సీజ‌న్లో 14 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శ‌ర్మ 23 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఐపీఎల్‌లో మోహిత్ శ‌ర్మ పంజాబ్ కింగ్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. చివ‌ర‌గా 2021లో అత‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇక 2013లో టీమిండియాలోకి అడుగుపెట్టిన మోహిత్ శ‌ర్మ 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్, 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాడు. కానీ ఈ సారి మెగా వేలంలో మోహిత్ శ‌ర్మ‌ను ఏ జ‌ట్టు కూడా కొనుగోలు చేయ‌లేదు. దీంతో ఐపీఎల్‌లోకి ఈ సారి కొత్త‌గా వచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు మోహిత్ శ‌ర్మ నెట్ బౌల‌ర్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం. మోహిత్ శ‌ర్మ‌తోపాటు బరీందర్ స్రాన్ కూడా గుజరాత్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శ‌ర్మ 8.45 ఎకాన‌మీతో 92 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/14గా ఉన్నాయి. ఇక అంత‌ర్జాతీయ క్రికెట్లో 26 వ‌న్డే మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/22 గా ఉన్నాయి. అలాగే 8 టీ20లు ఆడి 6 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 2/28 గా ఉన్నాయి.

Story first published: Sunday, March 20, 2022, 13:53 [IST]
Other articles published on Mar 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+