Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షమీపై ముంబై ఇండియ‌న్స్‌ కన్ను.. ఎన్ని కోట్లైన పెట్టడానికి రెడీగా అంబానీ టీం?

IPL 2022: Mohammed Shami To Play For Mumbai Indians, Ambani Team To Bid For Base Price 2 Crore

ఐపీఎల్ 2022 మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అంతటా ఆస‌క్తి పెరుగుతోంది. ఏ ఆట‌గాడు ఎంత ధ‌ర ప‌లుకుతాడ‌నే చర్చ అభిమానుల్లో మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ షమీని మెగా వేలంలో ద‌క్కించుకోవ‌డానికి ప‌లు ఫ్రాంచైజీలు పోటీ ప‌డుతున్నాయి. ఈ పోటీలో 5 సార్లు ఛాంపియ‌న్ అయినా మంబై ఇండియన్స్ మొద‌టి వ‌రుస‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఇత‌ర టీంలు కూడా పోటీ ప‌డుతున్న‌ప్ప‌టికీ ష‌మీ కోసం ఎన్ని కోట్లైనా ఖ‌ర్చు పెట్ట‌డానికి అంబానీ టీం సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.

ష‌మీని వ‌దిలేసిన పంజాబ్‌

ష‌మీని వ‌దిలేసిన పంజాబ్‌

ఐపీఎల్ చివ‌రి సీజ‌న్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇందుకు గాను చివ‌రి సీజ‌న్‌లో ష‌మీకి పంజాబ్ యాజమాన్యం అక్ష‌రాల 4.8 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించింది. చివ‌రి ఏడాదిలో ష‌మీ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ప్ర‌స్తుతం భారత జ‌ట్టు త‌ర‌ఫును కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఈ ఏడాది రిటెన్ష‌న్ జాబితాలో ష‌మీకి పంజాబ్ కింగ్స్ చోటు ఇవ్వ‌లేదు. దీంతో ష‌మీ ఈ సారి వేలంలో పాల్గొననున్నాడు.

 ష‌మీపై ముంబై క‌న్ను

ష‌మీపై ముంబై క‌న్ను

2 కోట్ల రూపాయ‌ల క‌నీస ప్రైజ్‌కు మ‌హ్మ‌ద్ ష‌మీ మెగా వేలంలో అందుబాటులో ఉన్నాడు. ఇటీవ‌ల సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో స‌త్తా చాటి త‌న‌లో స‌త్తువ ఏ మాత్రం త‌గ్గ‌లేదని ష‌మీ నిరూపించుకున్నాడు. దీంతో ష‌మీని వేలంలో కోనుగోలు చేయ‌డానికి ప‌లు ప్రాంచైజీలు ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఇందులో ఐపీఎల్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌ ముందు వ‌రుస‌లో ఉంది. ష‌మీని ఎంత ధ‌ర అయినా పెట్టి కొనుగోలు చేయాల‌ని ముంబై ఇండియ‌న్స్ టీం భావిస్తుంద‌ని స‌మాచారం.

 ష‌మీనే ఎందుకు? ధ‌ర ఎన్ని కోట్లు

ష‌మీనే ఎందుకు? ధ‌ర ఎన్ని కోట్లు

ఈ సారి త‌మ రిటెన్ష‌న్ జాబితాలో ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ, జ‌స్ప్రీత్ బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్, కీర‌న్ పోలార్డుల పేర్లు చేర్చింది. బుమ్రాకు తోడుగా ఉన్న కివీస్ పేస‌ర్ బోల్ట్‌కు చోటు ఇవ్వ‌లేదు. అందుకే బోల్ట్ స్థానాన్ని ష‌మీతో భ‌ర్తీ చేయాల‌ని ముంబై భావిస్తోంద‌ట‌. అప్పుడు భార‌త జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్లైనా బుమ్రా, ష‌మీతో త‌మ బౌలింగ్ ద‌ళం బ‌లంగా త‌యార‌వుతుంద‌ని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ష‌మీకి 5 కోట్ల రూపాయ‌లకు పైగా పెట్టేందుకు ముంబై ఇండియ‌న్స్ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ష‌మీ రికార్డులు

ష‌మీ రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడిన ష‌మీ 79 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/15. ఇక అంత‌ర్జాతీయ‌ టెస్టు క్రికెట్‌లో 57 మ్యాచ్‌ల్లో 209 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 6/56. 79 వ‌న్డేల్లో 148 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 5/69. ఇక 17 టీ20 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/15.

Story first published: Monday, January 24, 2022, 16:15 [IST]
Other articles published on Jan 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+