Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీలాగా కేప్టెన్సీ నుంచి తప్పుకోవయ్యా బాబు: రోహిత్‌కు ప్రత్యామ్నాయం అతనే

IPL 2022, MI vs PBKS: Rohit Sharma might leave Captaincy and hand the responsibility to Pollard

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవ్వాళ ముంబై ఇండియన్స్.. తన అయిదో మ్యాచ్‌ను ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో ఓటమి పొందిన రోహిత్ సేన.. గెలుపు కోసం ముఖం వాచిపోయి ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది ముంబై టీమ్. ఈ మ్యాచ్‌లోనైనా జయకేతనాన్ని ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది.

 చెన్నైని ఫాలో అవుతుందా?

చెన్నైని ఫాలో అవుతుందా?

ఈ కల ఎంతవరకు నెరవేరుతుందనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. ముంబై ఇండియన్స్ తరహాలోనే నాలుగు మ్యాచ్‌లల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్- ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ముంబై కూడా ఇవ్వాళ్టి మ్యాచ్‌లో విజయఢంకా మోగించాలని అభిమానులు కోరుకుంటోన్నారు. మరోవంక ఈ వరుస పరాజయాల దెబ్బ ముంబై ఇండియన్స్‌ జట్టును మానసికంగా కూడా కుంగదీసింది.

 ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమ్..

ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమ్..

టైటిల్ హాట్ ఫేవరెట్ జట్లల్లో ఒకటైన రోహిత్ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు మ్యాచ్‌లల్లో ఓడిన తరువాత మళ్లీ టైటిల్ రేసులో నిల్చోవాలంటే కఠోరంగా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు జట్టులో కనిపించట్లేదు. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. రథ సారథే విఫలమౌతుండటం వల్ల దాని దుష్ప్రభావం జట్టు మొత్తంపైనా పడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించట్లేదు.

తప్పుకోక తప్పదు..

తప్పుకోక తప్పదు..

ప్రత్యర్థికి భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనూ, దాన్ని ఛేదించే విషయంలోనూ ముంబై ఇండియన్స్ నాణ్యమైన ఆటతీరును కనపర్చట్లేదు. ఈ పరిణామాల మధ్య టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మను తప్పు పట్టారు. రోహిత్.. తన కేప్టెన్సీ వదులుకునే సమయం వచ్చిందని స్ఫష్టం చేశాడు. జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తేల్చి చెప్పాడు. తన వారసుడిగా కీరన్ పొల్లార్డ్‌ను రెకమెండ్ చేయాలని సూచించాడు సంజయ్ మంజ్రేకర్.

కోహ్లీ తరహాలో..

కోహ్లీ తరహాలో..

ఈ విషయంలో అతను- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కేప్టెన్‌ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని, అతణ్ని అనుసరించాలని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మకు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని అన్నాడు. కీరన్ పొల్లార్డ్ ఇప్పటికీ విలువైన ఆటగాడేనని, అతనిలో ఆ కాన్ఫిడెన్స్ ఉందని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. ఒత్తిళ్లను ఎదుర్కొనే పరిస్థితుల్లో జట్టును ఒడ్డున పడేయగల నాయకత్వ లక్షణాలు పొల్లార్డ్‌లో ఉన్నాయని, ఈ విషయం చాలా సందర్భాల్లో బహిర్గతమైందని పేర్కొన్నాడు.

రోహిత్ కంటే పొల్లార్డ్ బెటర్..

రోహిత్ కంటే పొల్లార్డ్ బెటర్..

ఒత్తిళ్లను ఎదుర్కొనడంలో రోహిత్ శర్మ కంటే పొల్లార్డ్ బెటర్ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కోసం రోహిత్ శర్మ ఏ రకంగా స్వేచ్ఛగా ఆడతాడో.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ తరఫునా అలాంటి గేమ్‌నే ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడగలిగితేనే పరిస్థితులు మెరుగుపడతాయని తేల్చి చెప్పాడు. రోహిత్ శర్మ కొంత స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, April 13, 2022, 14:06 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+