
బౌలర్లు ఫెయిల్..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ 70, మయాంక్ అగర్వాల్-52 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అక్కడే పంజాబ్ కింగ్స్ లక్ష్యం ఏమిటనేది స్పష్టమైంది. దీనికి అనుగుణంగా ఆ జట్టు ఇన్నింగ్ కొనసాగింది. ముంబై బౌలర్లు ఏ మాత్రం ఒత్తిడిని తీసుకుని రాలేకపోవడంతో స్వేచ్ఛగా ఆడారు పంజాబీ బ్యాటర్లు.

రోహిత్ ఫ్లాప్
రోహిత్ శర్మ కథ మళ్లీ మాములే. తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 28 పరుగులు చేసి, రబడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్‌దీ అదే పరిస్థితి. అతను చేసింది మూడు పరుగులే.
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ల తరహాలో ముంబై తొలి వికెట్ భాగస్వామ్యానికి భారీ స్కోర్‌ను అందించలేకపోయింది. అక్కడే ఓటమి ఖాయమైంది. టాప్ ఆర్డర్‌లో బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 49, తిలక్ వర్మ 20 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్‌తో 43 చేసిన పోరాటం వృధా అయింది.

రోహిత్, ఇతర ప్లేయర్లపై ఫైన్
ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ శర్మకు 24 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇది రెండోసారి. ఇదివరకు 12 లక్షల జరిమానాను చవి చూశాడు. రెండోసారి కూడా అదే తప్పిదం చోటు చేసుకోవడంతో నిబంధనల ప్రకారం.. జరిమానా మొత్తం రెట్టింపు అయింది. దీనితో పాటు జట్టు ఆటగాళ్లందరు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 10 ఆటగాళ్లు ఒక్కొక్కరు ఆరు లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఏది తక్కువ మొత్తం అయితే అది ఫైన్ రూపంలో కట్టాల్సి ఉంటుంది.

85 నిమిషాల్లో 20 ఓవర్లు..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకాం.. టీ20 ఫార్మట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్ 85 నిమిషాల్లో ముగియాల్సి ఉంటుంది. ఇన్నింగ్ ఆరంభమైన 85వ నిమిషంలో చివరి ఓవర్ అంటే.. 20వ ఓవర్‌ను వేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే షెడ్యూల్‌ను రూపొందించింది ఐసీసీ.
ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా.. దానికి ఫీల్డింగ్ చేసే జట్టు కేప్టెనే బాధ్యత వహిస్తాడు. జరిమానాను చెల్లిస్తాడు. తొలి స్లో ఓవర్ రేట్‌కు కేప్టెన్ 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి అదే తప్పు జరిగితే ఫైన్ మొత్తం 24 లక్షలకు పెరుగుంది. టీమ్ ప్లేయర్ల కూడా జరిమానకు బాధ్యులు అవుతారు.


Click it and Unblock the Notifications

