For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్ని ప్లాన్లు వేసినా గెలవలేకపోతున్నాం: ఏది జరగకూడదని అనుకున్నామో..అదే: రోహిత్ శర్మ ఆవేదన

IPL 2022, MI vs PBKS: Nothing is working out, We arent playing good cricket, says Rohit Sharma

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. అయిదో మ్యాచ్‌లోనూ ఘోరంగా ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఇది వరుసగా అయిదో ఓటమి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌ చేతిలో మట్టి కరిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యానికి 12 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అడుగు ఇక ముందుకు పడకపోవచ్చు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉందీ జట్టు.

199 పరుగుల టార్గెట్..

199 పరుగుల టార్గెట్..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ 70, మయాంక్ అగర్వాల్-52 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అక్కడే పంజాబ్ కింగ్స్ లక్ష్యం ఏమిటనేది స్పష్టమైంది. దీనికి అనుగుణంగా ఆ జట్టు ఇన్నింగ్ కొనసాగింది. ముంబై బౌలర్లు ఏ మాత్రం ఒత్తిడిని తీసుకుని రాలేకపోవడంతో స్వేచ్ఛగా ఆడారు పంజాబీ బ్యాటర్లు.

ముంబై ఇన్నింగ్‌లో..

ముంబై ఇన్నింగ్‌లో..

రోహిత్ శర్మ కథ మళ్లీ మాములే. తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్‌దీ అదే పరిస్థితి. అతను చేసింది మూడు పరుగులే. టాప్ ఆర్డర్‌లో బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ భారీ ఇన్నింగ్ ఆడాడు. 25 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. తిలక్ వర్మ-36, సూర్యకుమార్ యాదవ్-43, ఇన్నింగ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు గానీ.. అది విజయాన్ని అందించలేకపోయింది.

ఎన్ని ప్లాన్లేసినా..

ఎన్ని ప్లాన్లేసినా..

ఎన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ గెలవలేకపోతున్నామని రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌ను తాము బాగా ఆడామని, కీలక సమయాల్లో రనౌట్స్ విజయావకాశాలను దెబ్బ తీశాయని వ్యాఖ్యానించాడు. ఏది జరక్కూడదని అనుకున్నామో.. అది జరిగిందని పేర్కొన్నాడు. మెరుగైన రన్‌రేట‌్‌ను కొనసాగించినా, చివర్లో ఒత్తిడిని జయించలేకపోయామని చెప్పాడు. పరాజయాలు చవి చూస్తోన్న నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు పూనుకున్నామని వివరించాడు. బ్యాటర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

ఓపెనింగ్ భాగస్వామ్యంపై..

ఓపెనింగ్ భాగస్వామ్యంపై..

పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ భాగస్వామ్యం ఆ జట్టు భారీ స్కోర్ చేయడానికి కారణమైందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ప్రారంభ ఓవర్లల్లో బౌలర్లు ఓపెనర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయారని చెప్పారు. ఈ విషయంలో తాము వేసుకున్న ప్లాన్లు ఏవీ వర్కవుట్ కాలేదని స్పష్టం చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిందని, 190 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించగలమని తాము భావించామని, దానికి తగినట్టే తమ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ పని చేసిందనీ చెప్పాడు.

ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్..

ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్..

తమ ప్రణాళికలన్నింటినీ మరోసారి సమీక్షించుకుంటామని, గెలవడానికి ఏం చేయాలో అంతా చేస్తామనీ అన్నాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో వేసుకున్న ప్లాన్స్‌ను గ్రౌండ్‌లో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నామని, వాటిని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడటానికి అన్నిరకాలుగా జట్టు సిద్ధంగా ఉందని, ఎలాంటి నెగెటివ్స్ రిమార్క్స్ కనిపించట్లేదని, అయినా ఓటమి తప్పట్లేదని వాపోయాడు.

Story first published: Thursday, April 14, 2022, 7:39 [IST]
Other articles published on Apr 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+