
భారీ భాగస్వామ్యం కొరత..
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో మట్టి కరిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ 70, మయాంక్ అగర్వాల్-52 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఛేజింగ్‌కు దిగిన రోహిత్ సేన ప్రారంభ ఓవర్ల నుంచే తడబడింది. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ల తరహాలో ముంబై తొలి వికెట్ భాగస్వామ్యానికి భారీ స్కోర్‌ను అందించలేకపోయారు.

టాప్, మిడిలార్డర్ ఆదుకున్నా..
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కుదురుకున్నప్పటికీ- సుదీర్ఘ ఇన్నింగ్ ఆడలేకపోయారు. చివరికంటా నిలవలేకపోయారు. బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 49, తిలక్ వర్మ 20 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 చేసిన పోరాటం వృధా అయింది.
కీలక సమయాల్లో రనౌట్లు ముంబై ఇండియన్స్‌ను నిండా ముంచేశాయి. పంజాబ్ కింగ్స్ మెరుపు ఫీల్డింగ్ ముందు తలవంచేలా చేసింది. కగిసొ రబడ, ఒడియన్ స్మిత్, అక్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ముంబై.

వరుసగా అయిదో ఓటమి..
తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్ ఓడిపోయిందో గానీ.. ఇప్పటిదాకా తేరుకోవట్లేదు. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. మూడో మ్యాచ్‌లో- ముంబై నిర్దేశించిన 162 పరుగులను కోల్‌కత నైట్‌రైడర్స్ కొట్టేసింది. నాలుగో మ్యాచ్‌లో ఇదే పరిస్థితి.
151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. రాయల్ ఛాలెంజర్స్ మూడు వికెట్లను కోల్పోయి.. దాన్ని అందుకుంది. అయిదో మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం అందుకోలేక పోయింది రోహిత్ సేన.

లెక్క బరాబర్..
నిజానికి- ఐపీఎల్ టోర్నమెంట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఇదే. ఇప్పటిదాకా అయిదుసార్లు ట్రోఫీని ముద్దాడింది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ల ఛాంపియన్ ముంబై ఇండియన్సే. చివరి రెండు ట్రోఫీలను బ్యాక్ అండ్ బ్యాక్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసింది.
గత సీజన్ నుంచి ఈ టీమ్ ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఏడు మ్యాచ్‌లల్లో ఓడింది. అవే పరిస్థితులు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్‌లోనే అయిదు మ్యాచ్‌లను కోల్పోయింది. టోర్నమెంట్‌లో చివరి వరకూ ముంబై ఇండియన్స్ ప్రయాణం సాగే అవకాశాలను దాదాపుగా పోగొట్టుకున్నట్టే.


Click it and Unblock the Notifications












