Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs LSG Playing 11: రోహిత్ సేన ఆకలికి లక్నో జెయింట్స్ ఆహారం అవుతుందా?: అంచనాలివే

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్‌లో భాగంగా మరో కీలకమైన మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తోన్న ముంబై ఇండియన్స్‌ తన ఎనిమిదో మ్యాచ్‌ను ఆడనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీ కొట్టనుంది. వాంఖెడె స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

 ముంబైకి డెత్ గేమ్..

ముంబైకి డెత్ గేమ్..

ముంబై ఇండియన్స్‌కు ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే- ప్లే ఆఫ్ చేరే ఆశలు, అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం టోర్నమెంట్ రేస్ నుంచి తప్పుకోవడం పక్కా. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడింది. సగం టోర్నమెంట్ అయిపోయినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవని టీమ్ ఇదొక్కటే. ఆ జట్టు ఖాతాలో ఉన్న పాయింట్లు.. జీరో. పాయింట్ల పట్టికలో 10 స్థానం నుంచి లేవలేకపోతోంది.

ఆకలికి బలి అవుతుందా?

ఆకలికి బలి అవుతుందా?

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుని.. తన ఆకలిని తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. వరుసగా విఫలమౌతున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కుదురుకుంటే మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలే. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. వీరిలో ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వారందరూ అట్టర్ ఫ్లాప్.

 పొల్లార్డ్ రీప్లేస్..

పొల్లార్డ్ రీప్లేస్..

లోయర్ ఆర్డర్‌లో కీరన్ పొల్లార్డ్‌కు బదులుగా టిమ్ డేవిడ్‌ను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పొల్లార్డ్ ఫ్లాప్ షోను కంటిన్యూ చేస్తోన్నాడు. ఒక్క మ్యాచ్‌లోనూ 25 పరుగులను కూడా దాటలేదు. అతణ్ని డగౌట్‌కే పరిమితం చేసి, టిమ్ డేవిడ్‌ను తుదిజట్టులో తీసుకునే అవకాశాలు లేకపోలేదు. హృతిక్ షోకీన్ ఫర్వాలేదనిపించుకున్న నేపథ్యంలో అతణ్ని కొనసాగించవచ్చు లేదా.. మయాంక్ మార్కండేకు చోటు కల్పించవచ్చు.

దూకుడు మీదున్న లక్నో..

దూకుడు మీదున్న లక్నో..

కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ దూకుడు మీద ఉంది. ఏడు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌కు తగ్గట్టే ఆల్‌రౌండర్లతో నిండుగా ఉందీ టీమ్. బ్యాటర్లు, బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. కేఎల్ రాహుల్ కాక మీదున్నాడు. బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొంటోన్నాడు. బుమ్రా నుంచి 99 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 124 పరుగులు చేశాడు. బుమ్రా బౌలింగ్ మీద అతని స్ట్రైక్ రేట్ 125.25.

మనీష్ పాండేకు నో ఛాన్స్..

మనీష్ పాండేకు నో ఛాన్స్..

ముంబై ఇండియన్స్‌పై లక్నో జెయింట్స్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫామ్‌ కోల్పోయిన మనీష్ పాండేకు బదులుగా కృష్ణప్ప గౌతమ్‌ను దించే అవకాశం ఉంది. మిగిలిన ప్లేయర్లలో పెద్దగా మార్పులు చేర్పులు చేయకపోవచ్చు. దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్.. ఇన్నింగ్‌ను నిలబెడుతున్నారు. ఆల్‌రౌండర్లు మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్ సహా దుష్మంత చమీర, అవేష్ ఖాన్‌, రవి బిష్ణోయ్‌లను ముంబై ఇండియన్స్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.

 తుది జట్లు అంచనాలివే.

తుది జట్లు అంచనాలివే.

ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్/టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్/మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, జస్‌ప్రీత్ బుమ్రాకు చోటు దక్కే అంచనాలు ఉన్నాయి. లక్నోలో- కేఎల్ రాహుల్ (కేప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే/కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ ఆడొచ్చు.

Story first published: Sunday, April 24, 2022, 10:55 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+