Daniel Sams: నాడు విలన్..ఇప్పుడు హీరో: లెక్క బరాబర్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది రెండో గెలుపు. ఈ విజయానికి ప్రధాన కారకుడు మాత్రం డేనియల్ సామ్స్. క్రెడిట్ అతనికే దక్కాలి. కట్టుదిట్టంగా బంతులను సంధించాడు. మెరికల్లాంటి గుజరాత్ బ్యాటర్లను కట్టి పడేశాడు.

ఏప్రిల్ 6న విలన్‌గా..
ఏప్రిల్ 6వ తేదీన- కోల్‌కత నైట్‌రైడర్స్ చేతుల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు ఇదే డేనియల్ సామ్స్. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 161 పరుగులు చేయగా.. కోల్‌కత నైట్‌రైడర్స్ దాన్ని 16 ఓవర్లల్లోనే ఛేదించింది. ఆ మ్యాచ్ 16వ ఓవర్‌ను వేసింది డేనియల్ సామ్స్. ఆ ఓవర్ అతనికి నైట్‌మేర్‌లా మారి ఉండొచ్చు. నిద్రలేకుండా చేసి ఉండొచ్చు. చివరి 30 బంతుల్లో చేయాల్సిన 35 పరుగులను ఆ ఒక్క ఓవర్‌లనే రాబట్టుకున్నాడు కోల్‌కత నైట్‌రైడర్స్ బ్యాటర్ పాట్ కమిన్స్.

ఒకే ఓవర్‌లో 35 పరుగులు..
ఒక నో బాల్ సహా మొత్తం 35 పరుగులొచ్చాయా ఓవర్‌లో. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లను కొట్టి అవతల పడేశాడు కమిన్స్. కాస్త గట్టిగా పోరాడివుంటే ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వశం అయ్యుండేదేమో. ఆ అవకాశం లేకుండా చేశాడు కమిన్స్. డేనియల్ సామ్స్ సంధించిన ఆ ఒక్క ఓవర్‌లోనే 35 పరుగులను పిండుకున్నాడు. ఆ మ్యాచ్ తరువాత అందరూ డేనియల్ సామ్స్‌ను విలన్‌ను చూసినట్టు చూశారు. ఆ తరువాతి మ్యాచ్‌ల నుంచి అతణ్ని తప్పించారు.

మే 6న హీరోగా..
మే 6వ తేదీన- అదే డేనియల్ సామ్స్.. హీరోగా ఆవిర్భవించాడు. బలమైన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను తన పదునైన బౌలింగ్‌తో కట్టి పడేశాడు. స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. వికెట్ పడగొట్టలేనప్పటికీ.. మ్యాచ్‌ను గెలిపించాడు. చివరి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో బంతిని అందుకున్న డేనియల్- మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడంటే.. అతను ఏ స్థాయిలో నిప్పులు చెరిగాడో అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్‌లో అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాడు.

కట్టుదిట్టంగా బౌలింగ్..
చివరి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో డాట్ బాల్స్ సంధించడం అంటే మాటలు కాదు. పైగా డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ వంటి పించ్ హిట్టర్ల వద్ద సామ్స్ అతను సంధించిన బంతులకు సమాధానం లేకుండా పోయింది. తొలి బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో ఓవర్‌కు నో రన్. మూడో బంతికి రన్ తీయబోయి తెవాతియా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి రషీద్ ఖాన్ సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు. చివరి రెండు బంతులు డాట్స్‌గా మిగిలాయి. ఆ సామ్స్.. ఈ సామ్సేనా అనిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications