For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాంటీ క్లైమాక్స్: ప్లేఆఫ్స్ ముంగిట్లో గుజరాత్ బొక్క బోర్లా: ముంబై చేతిలో ఓటమికి కారణాలివే

Here is the five reasons why Gujarat Titans lost the match against Mumbai Indians in IPL 2022.

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌ సెకెండ్ హాఫ్ రసవత్తరంగా మారింది. ఒక్క విజయం సాధించగలిగితే ప్లేఆఫ్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టే దశలో గుజరాత్ టైటాన్స్ బొక్క బోర్లా పడుతోంది. వరసగా రెండు మ్యాచ్‌లల్లో బోల్తా కొట్టింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించగలుగుతుందీ టీమ్. ఆ ఒక్క విజయాన్ని అందుకోవడానికి నానాతంటాలు పడుతోంది. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో దారుణంగా ఓడింది గుజరాత్ టైటాన్స్‌.

106 పరుగుల భాగస్వామ్యాన్ని విజయంగా

106 పరుగుల భాగస్వామ్యాన్ని విజయంగా

శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ-43, ఇషాన్ కిషన్-45, టిమ్ డేవిడ్- 44 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది.

ఒకే ఓవర్‌లో ఆ ఇద్దరు..

ఒకే ఓవర్‌లో ఆ ఇద్దరు..

వృద్దిమాన్ సాహా-55, శుభ్‌మన్ గిల్-52 హాఫ్ సెంచరీలతో 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది గుజరాత్. మురుగున్ అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో గుజరాత్ పతనం ఆరంభమైంది. తొలి బంతికి శుభ్‌మన్ గిల్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహా అవుట్ అయిన తరువాత ఇక కోలుకోలేకపోయింది. అప్పటికి జట్టు స్కోరు 111. వికెట్లు చేతిలో ఉన్నా, హిట్టర్లు క్రీజ్‌లో ఉన్నా గానీ విజయాన్ని అందుకోలేకపోయింది.

 హిట్ వికెట్.. రనౌట్..

హిట్ వికెట్.. రనౌట్..

సాయి సుదర్శన్ హిట్ వికెట్, హార్దిక్ పాండ్యా రనౌట్‌.. గుజరాత్‌కు విజయాన్ని దూరం చేశాయి. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద సాయి సుదర్శన్, 156 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన సుదర్శన్.. హిట్ వికెట్‌గా వెనుదిరగడంతో గుజరాత్ బ్యాటింగ్ రిథమ్ దెబ్బతింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ డైరెక్ట్ హిట్‌తో హార్దిక్ పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, క్రీజ్‌లో ఉండటం వల్ల గెలుపుపై ఢోకా లేదనుకున్నప్పటికీ.. క్లైమాక్స్ తారుమారైంది.

 గెలిపించలేకపోయిన హిట్టర్స్..

గెలిపించలేకపోయిన హిట్టర్స్..

డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ క్రీజ్‌లో ఉండి కూడా గెలిపించలేకపోయాడంటే దరిద్రం ఏ రేంజ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను వెంటాడుతోందో అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులను కూడా సాధించలేక ఓడిపోవాల్సి రావడం.. ఐపీఎల్ వంటి ఫార్మట్‌లో చాలా చాలా అరుదు. ఇన్నాళ్లు మ్యాచ్ విన్నర్లుగా ఉంటూ వచ్చిన డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్.. చివరి బంతులను ఎదుర్కొన్నా పరుగులు సాధించలేకపోయారు.

సామ్స్ మేజిక్..

సామ్స్ మేజిక్..

చివరి ఓవర్‌లో డేనియల్ సామ్స్ మేజిక్ చేశాడు. తొమ్మిది పరుగులను ఇవ్వకుండా కాపాడుకున్నాడు. అతను సాధించిన తొలి బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో ఓవర్‌కు నో రన్. మూడో బంతికి రన్ తీయబోయి తెవాతియా అవుట్ కావడంతో మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది. నాలుగో బంతికి రషీద్ ఖాన్ సింగిల్ తీశాడు. చివరి రెండు బంతులు డాట్స్‌గా మిగిలాయి. ఈ రెండింటినీ డేవిడ్ మిల్లర్ ఫేస్ చేశాడు గానీ.. పరుగులు రాబట్టుకోలేకపోయాడు.

Story first published: Saturday, May 7, 2022, 8:55 [IST]
Other articles published on May 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+