రిషభ్ పంత్ సరిదిద్దుకోలేని తప్పిదం..టిమ్ డేవిడ్ అవుట్‌పై రివ్యూ కోరని వైనం

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లల్లో ఒకటి- ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య పోరు. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో ఢిల్లీ కేపిటల్స్ ఓడిపోయింది. తన ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. దాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అప్పగించింది. ఈ మ్యాచ్‌ గెలిచివుంటే రిషభ్ పంత్ సారథ్యంలోని కేపిటల్స్- దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేది. రాయల్ ఛాలెంజర్స్‌కు ఆ అవకాశం దక్కి ఉండేది కాదు.

తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు టిమ్ డేవిడ్. పిడుగుల్లాంటి షాట్లు ఆడాడు. 11 బంతులను మాత్రమే ఎదుర్కొన్న టిమ్ డేవిడ్- 34 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పేశాడీ సింగపూర్-ఆస్ట్రేలియన్ క్రికెటర్. శార్దుల్ ఠాకూర్ వేసిన యార్కర్‌కు బలి అయ్యాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

నిజానికి- అంతకంటే ముందే టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు గానీ.. ఢిల్లీ కేపిటల్స్ కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ తరువాత చెలరేగిపోయాడు. కేపిటల్స్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు. రివ్యూ కోరివుంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రెండు రివ్యూలు చేతిలో ఉన్నప్పటికీ.. దాన్ని ఉపయోగించుకోవడంలో పంత్ విఫలం అయ్యాడు.

15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శార్దుల్ ఠాకూర్ వేసిన ఓవర్ అది. ఫుల్లర్‌గా సంధించిన ఆ ఓవర్ నాలుగో బంతిని డ్రైవ్ చేయబోయాడు టిమ్ డేవిడ్. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్తా బ్యాట్ ఎడ్జ్‌ను ముద్దాడుతూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో వాలింది. పంత్, శార్దుల్ ఠాకూర్ సహా ప్లేయర్లందరూ అప్పీల్ చేశారు. అంపైర్ దీనికి అంగీకరించలేద. అవుట్ ఇవ్వలేదు. రివ్యూ అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని తీసుకోలేదు పంత్.

నిజానికి ఆ బంతి.. బ్యాట్‌ అంచులను తాకినట్టు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. రివ్యూ తీసుకుని ఉంటే టిమ్ డేవిడ్ అప్పుడే అవుట్ అయ్యేవాడు. గోల్డెన్ డక్ అవుట్ అయ్యేవాడు. ఆ ఓవర్ మూడో బంతికే డెవాల్డ్ బ్రేవిస్‌ను బలి తీసుకున్నాడు శార్దుల్ ఠాకూర్. నాలుగో బంతికి టిమ్ డేవిడ్ అవుట్ అయినా.. రివ్యూ కోరకపోవడంతో బతికి పోయాడు. ఆ తరువాత సునామీ ఇన్నింగ్ ఆడాడు. 11 బంతుల్లోనే 34 పరుగులు బాది అవతల పడేశాడు. ఢిల్లీ కేపిటల్స్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 22, 2022, 11:03 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X