అట్లుంటది ఆర్సీబీతోని: బంగారు పళ్లెంలో పెట్టి మరీ ప్లేఆఫ్స్ అవకాశాలను అప్పగించిన ఢిల్లీ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్.. ప్లేఆఫ్స్ పిక్చర్ క్లియర్ అయింది. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియన్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ అనంతరం ప్లేఆఫ్స్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ఢిల్లీ కేపిటల్స్.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఆ బంగారం లాంటి అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ధారపోసినట్టయింది. ఈ మ్యాచ్ గెలిచివుంటే రిషభ్ పంత్ టీమ్ ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేది. రాయల్ ఛాలెంజర్స్ ఇంటిదారి పట్టేది.

బ్యాటింగ్ డైనమేట్స్ వెంటవెంటనే అవుట్..

బ్యాటింగ్ డైనమేట్స్ వెంటవెంటనే అవుట్..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌కు దాసోహమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లను కోల్పోవడంతోనే.. ఆ జట్టు పరుగుల వేగం మందగించింది. ఈ మూడూ కీలకమైన వికెట్లే. స్కోర్ బోర్డును పరుగులెత్తించే బ్యాటర్లే. ప్రారంభ ఓవర్లలోనే బ్యాటింగ్ డైనమేట్స్ డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్ అవుట్ కావడం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది.

మందకొడిగా..

మందకొడిగా..

టాప్ ఆర్డర్‌లో రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు గానీ.. బ్యాటింగ్‌లో స్పీడ్ లోపించింది. 23 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 24 పరుగులు చేశాడు పృథ్వీ షా. రిషభ్ పంత్ 33 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్ వెంటనే అవుట్ అయినా.. రౌమన్ పావెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. 43 పరుగులు చేశాడీ విండీస్ విధ్వంసకారుడు.

75 పరుగుల భాగస్వామ్యం ఉన్నా..

75 పరుగుల భాగస్వామ్యం ఉన్నా..

అయిదో వికెట్ భాగస్వామ్యానికి 75 పరుగులు జోడించినప్పటికీ.. ఢిల్లీ కేపిటల్స్ దాన్ని భారీ స్కోర్‌గా మలచుకోలేకపోయింది. చివరి అయిదు ఓవర్లల్లో 34 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే- బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రౌమన్ పావెల్ ఒక్కడే బ్యాటింగ్ ఝుళిపించాడు. ముంబై బౌలర్లను భయపెట్టాడు. స్కోర్ బోర్డును పరుగులెత్తించే క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పేస్ బౌలింగ్‌కు దాసోహం..

పేస్ బౌలింగ్‌కు దాసోహం..

ముంబై ఇండియన్స్ అటాకింగ్ బౌలింగ్‌కు ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లు దాసోహం అయ్యారు. కీలకమైన మ్యాచ్‌లో అటు ఒత్తిడినీ జయించలేకపోయారు. డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్ వికెట్లను పోగొట్టుకున్నారు. రమణ్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మాత్రమే కాస్త భారీ షాట్లు ఆడారు. డేనియల్ సామ్స్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, మయాంక్ మార్కండే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేని పరిస్థితిని కల్పించారు.

ఆసీస్ ద్వయం..విఫలం..

ఆసీస్ ద్వయం..విఫలం..

ఇన్ని మ్యాచ్‌లల్లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయాలను సాధించడానికి ప్రధాన కారణం- ఓపెనర్ డేవిడ్ వార్నర్. బౌలర్ల తుక్కు రేగ్గొడుతూ వచ్చిన వార్నర్.. ఈ మ్యాచ్‌లో చతికిల పడ్డాడు. అయిదు పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మిఛెల్ మార్ష్ సైతం అవుట్ కావడం జట్టు బ్యాటింగ్ రిథమ్‌ను దెబ్బకొట్టింది. మిఛెల్‌ది గోల్డెన్ డక్. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడీ ఆసీస్ ఆల్‌రౌండర్. వీరిద్దరూ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 22 పరుగులు. ఆ తరువాత పుంజుకోలేకపోయింది బ్యాటింగ్ విభాగం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 22, 2022, 8:48 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X