Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్‌ ఆపద్బాంధవుడు: రోహిత్ సైన్యంలో కొత్త బౌలర్: మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా

IPL 2022, MI vs CSK:Unsold Dhawal Kulkarni all set to join Mumbai Indians squad for the IPL 2022

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌.. ముంబై ఇండియన్స్ ఏ మాత్రం అచ్చి రావట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే అన్నీ అపజయాలను మూటగట్టుకుంది. అయిదు సార్లు ఛాంపియన్ ఆవిర్భవించి- మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా గుర్తింపు పొందిన ఈ జట్టు.. ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఆరుకు ఆరూ ఓడిపోయింది.

చెన్నైతో ఫైట్..

చెన్నైతో ఫైట్..

పాయింట్ల పట్టికలో అట్టుడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. తన తరువాతి మ్యాచ్‌లో తనలాగే అధ్వాన్నంగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది. గురువారం ఈ మ్యాచ్‌ను ఉంటుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇందులో విజయం సాధించడం ద్వారా బోణీ కొట్టాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా కఠోరంగా శ్రమిస్తోంది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.

అన్ని వనరుల ప్రయోగం..

అన్ని వనరుల ప్రయోగం..

ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ముంబై ఇండియన్స్ .. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ఏరికోరి తుదిజట్టును రూపుదిద్దుకుంటోంది. ఈ మ్యాచ్‌తో పాటు ఇకపై ఎదుర్కొనబోయే అన్నింట్లోనూ భారీ రన్‌రేట్‌తో రాణించ గలిగితేనే- ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగుతుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా.. ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోయినట్టే..

ధవల్ కులకర్ణిని జట్టులోకి..

ధవల్ కులకర్ణిని జట్టులోకి..

ఈ పరిణామాల మధ్య ముంబై ఇండియన్స్ ఓ సర్‌ప్రైజ్ నిర్ణయాన్ని తీసుకుంది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకోనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపో, మాపో- అతను ముంబై ఇండియన్స్ జట్టుతో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగే మ్యాచ్‌ ఆరంభం అయ్యే సమయానికి ధవల్ కులకర్ణి అందుబాటులో ఉండకపోవచ్చు గానీ.. ఆ తరువాతి గేమ్స్‌కు తుదిజట్టులో ప్లేస్‌మెంట్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

అన్‌సోల్డ్ ప్లేయర్‌గా..

అన్‌సోల్డ్ ప్లేయర్‌గా..

ముంబై ఇండియన్స్‌‌తో కలిసి ఆడిన అనుభవం ధవల్ కులకర్ణికి ఉంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంఛైజీలకూ ప్రాతినిథ్యాన్ని వహించాడీ 33 సంవత్సరాల వయస్సున్న వెటరన్ ఫాస్ట్ బౌలర్. 2020లో 75 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. గత సంవత్సరం కూడా అతను ముంబైలోనే కనిపించాడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

రోహిత్ శర్మ ఇంట్రస్ట్..

రోహిత్ శర్మ ఇంట్రస్ట్..

మొత్తంగా 92 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన ధవల్ కులకర్ణి 86 వికెట్లను పడగొట్టాడు. 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. అతణ్ని టీమ్‌లోకి తీసుకోవడానికి కేప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తిగా ఉన్నాడని, ఫ్రాంఛైజీని ఒప్పించాడనీ అంటున్నారు. అతన్ని జట్టులోకి తీసుకోవడం వల్ల బౌలింగ్ మరింత బలోపేతమౌతుందని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతని రాక ఎంత వరకు ముంబై ఇండియన్స్ తలరాతను మార్చుతుందనేది ఆసక్తికరం.

Story first published: Wednesday, April 20, 2022, 15:12 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+