Trolls on KKR: కేకేఆర్ దారుణ పరాజయంపై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డ మీమర్స్

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు క్లోజ్ అయినట్లే. మరో వైపు నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై 75పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకున్న లక్నో దాదాపు ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే. భారీ గెలుపుతో నెట్ రన్‌రేట్ సైతం భారీగా పెంచుకుంది. 16పాయింట్లతో +0.703 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో లక్నో కొనసాగుతుంది.
ఇక ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఓడినా దాదాపు ప్లేఆఫ్ అయితే చేరుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయంతో కేకేఆర్ 8పాయింట్లతో -0.304 నెట్ రన్ రేట్‌తో ఘోరంగా వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఆఖరి నుంచి మూడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా కూడా ఆ జట్టు ప్లేఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి.
పెవిలియన్‌కు క్యూ
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 176పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), దీపక్ హుడా(41), స్టోయినీస్ (28) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా 14.3ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. జాసన్ హోల్డర్(3/31),ఆవేశ్ ఖాన్(3/19) బౌలింగ్ దెబ్బకు కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అతనొక్కడే
కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45), సునీల్ నరైన్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) కాస్త ప్రతిఘటించిన అది విజయానికి ఏమాత్రం సరిపోలేదు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. కేకేఆర్ 75పరుగుల తేడాతో భారీగా ఓడిపోవడంతో అభిమానులు సైతం నిరాశచెందుతున్నారు. ఇక ట్రోలర్స్ అయితే దొరికిందే ఛాన్స్ కదా అన్నట్లు కేకేఆర్ పై మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.
ఆవో ఆవో అని ముంబై, సీఎస్కే కేకేఆర్‌ను పిలుస్తున్నట్లు..
ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన సీఎస్కే, ముంబై జట్లు.. కేకేఆర్‌ను కూడా తమ చెంతకు ఆహ్వానిస్తున్నట్లు మీమర్స్ తమ క్రియేటివిటీని చూపించారు. ఇకపోతే ముంబై, సీఎస్కే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువసార్లు ట్రోఫీలు గెలిచిన జట్లు. కానీ ప్రస్తుతం అట్టడుగున కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు అని స్పష్టమవుతోంది.
షారుఖ్ ఖాన్ దీన పరిస్థితిని చూపిస్తూ..
ఇక కొందరు మీమ్ క్రియేటర్లు కేకేఆర్ సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేశారు. పాపం కేకేఆర్ ఓటమి, ప్లేఆఫ్ నుంచి దూరం కావడంతో షారుఖ్ ఏడుస్తున్నాడు అనేలా.. షారుఖ్ మూవీ క్లిప్‌ను పోస్టు చేసి మీమ్ క్రియేట్ చేశారు. షారుఖ్ ఖాన్.. కేకేఆర్ మ్యాచ్‌లు ఆడుతుంటే గ్రౌండ్లోకి వచ్చి మరీ ప్లేయర్లను ప్రోత్సహిస్తుంటారనే సంగతి తెలిసిందే.
శ్రేయస్ అయ్యార్‌ను టార్గెట్ చేశారు
మరికొందరు మీమర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను టార్గెట్ చేశారు. కెప్టెన్‌గా శ్రేయస్ దారుణంగా విఫలమయ్యాడని చాలా మీమ్స్ పోస్టు చేశారు. ఇక గతంలో కేకేఆర్‌కు గంభీర్ కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు కేకేఆర్ బలంగా ఉండేదని.. ప్రస్తుతం పీలగా తయారయిందనేలా ఓ కార్టూన్ పోస్టు చేసి మీమ్ క్రియేట్ చేశారు.
ఆండ్రీ రస్సెల్ ఒక్కడే దిక్కు
ఇక ఈ మ్యాచ్ లో ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ మాత్రం తన ప్రతాపాన్ని చూపించాడు. మిగతా బ్యాటర్లందరూ ఔట్ అయినా రస్సెల్ ఇంకా ఉన్నాడనే భరోసా కేకేఆర్ అభిమానుల్లో ఉంటుంది. అలాంటిది రస్సెల్ కూడా 45పరుగులు చేశాక ఔటవ్వడంతో కేకేఆర్ తుది ఆశలు కూడా పోయాయి. ఆ టైంలో కేకేఆర్ అభిమానుల పరిస్థితిని చూపించేలా ట్రాజెడీ మీమ్స్ కూడా మీమర్స్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications