IPL 2022 Mega Auction: డివిలియర్స్ కథ ముగిసింది.. వచ్చే ఏడాది అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే!

IPL 2022 Mega Auction: MR 360 ప్రస్థానం ముగిసిందా ? AB De Villiers Unsold అవకాశం ? | Oneindia Telugu

హైదరాబాద్: సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్ ఆడటం కష్టమే అనిపిస్తోంది. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన ఏబీడీ.. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో అతని వైఫల్యం కొనసాగుతుంది. అటు సౌతాఫ్రికాకు గానీ.. ఇటు ఆర్‌సీబీకి గానీ కీలక మ్యాచ్‌ల్లో ఏబీడీ రాణించింది లేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఏబీడీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో క్రికెటర్‌గా ఏబీడి ప్రస్థానం కూడా ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూఏఈలో విఫలం..

యూఏఈలో విఫలం..

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ప్రతీ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. తనలో క్రికెట్ ఆడే సత్తా ఏం తగ్గలేదని నిరూపించాడు. ఓ దశలో సౌతాఫ్రికా జట్టులో రీఎంట్రీ ఇస్తాడని కూడా ప్రచారం జరిగింది. సౌతాఫ్రికా టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం ఏబీడీని ఆహ్వానించగా అతను తిరస్కరించాడు. తాజా సీజన్‌లోను ఏబీడీ రాణించాడు. 15 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 313 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. అయితే యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో మాత్రం ఏబీడీ దారుణంగా విఫలమయ్యాడు.

8 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు..

8 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు..

సెకండాఫ్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయాడు. 0, 12, 11, 4*, 23, 19*, 26, 11 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. బంతిని బాదేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకప్పటిలా స్వేచ్చగా షాట్లు ఆడలేకపోయాడు. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ రాణించడంతో డివిలియర్స్ వైఫల్యం పెద్దగా కనిపించలేదు. కానీ కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు విఫలమవడంతో డివిలియర్స్ తడబాటు తెలిసింది. ఈ వైఫల్యం నేపథ్యంలో ఏబీడీ వచ్చే సీజన్ ఆడకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నిరకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే..

అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే..

ఒకవేళ ఆడాలనుకున్నా మెగా వేలం నేపథ్యంలో అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చకపోవచ్చు. అన్ని జట్లు పూర్తిగా మారనున్న నేపథ్యంలో రెండు, మూడేళ్లకు కావాల్సిన కోర్ టీమ్‌ను ఎంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆర్‌సీబీ కూడా ఏబీడీని రిటైన్ చేసుకోకపోవచ్చు. రిటెన్షన్ పాలసీ తెలియనప్పటికీ.. విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ను అంటిపెట్టుకునే అవకాశం ఉంది. దాంతో ఏబీడీ అమ్ముడుపోని జాబితాలో చేరవచ్చు. అయితే ఆ పరిస్థితి అతను తెచ్చుకోకపోవచ్చు. ఒకవేళ ఏ జట్టు అయిన తీసుకుంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఎలిమినేటర్‌లో ఓడిన అనంతరం ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఏబీడి ఆపుకోలేకపోయాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి ఘనంగా తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని కోహ్లీ భావించి ఉంటాడు.

నరైన్ ఒక్కడే..

నరైన్ ఒక్కడే..

ఇక ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్‌(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 12, 2021, 14:23 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X