IPL 2022 Mega Auction Date: ఫిబ్రవరి 12,13న ఐపీఎల్ మెగా వేలం

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలానికి బెంగళూరు వేదికగా నిల్వనుంది. దీంతో ఐపీఎల్ జట్లు అన్నింటికీ బీసీసీఐ ఈ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వేలానికి సిద్ధంగా ఉండాలని అన్ని జట్లకు సూచించిందని సమాచారం. దీంతో ఐపీఎల్ జట్లన్నీ మెగా వేలానికి రెడీ అయిపోతున్నాయి.
అన్ని జట్ల వద్ద కావాల్సినన్నీ డబ్బులు ఉండడంతో స్టార్ ప్లేయర్లతోపాటు నైపుణ్యం గల ఆటగాళ్లను కొనుగోలు చేయాలని జట్లన్ని భావిస్తున్నాయి. ఈ మేరకు ఏ జట్టుకు ఆ జట్టు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. మెగా వేలంలో తమ ప్రణాళికలను అనుకున్నట్లుగా అమలు చేయగలిగితే తమకు తిరుగుండదని ఆయా జట్లు భావిస్తున్నాయి.

సీవీసీకి క్లీన్ చీట్
నిజానికి ఐపీఎల్ మెగా వేలం ఈ పాటికే జరగాల్సి ఉంది. కానీ అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్ మీద బెట్టింగ్ ఆరోపణలు రావడంతో వేలం వాయిదా పడింది. సీవీసీకి పలు బెట్టింగ్ సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీ విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ నివేదిక ఆలస్యమవడంతో వేలం వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్‌కు క్లీన్ లభించింది. దీంతో ఇక మెగా వేలానికి వెళ్లడమే మిగిలి ఉంది.

కొత్త జట్లకు ముందే ఆటగాళ్లను కొనుకునే అవకాశం
ఇప్పటికే పాత జట్లన్నీ తమకు కావాల్సిన ఆటగాళ్లను నలుగురికి మించకుండా పలు నిబంధనలకు లోబడి రిటెన్షన్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జట్లు అయినా లక్నో, అహ్మదాబాద్ మెగా వేలానికి ముందే తమకు నచ్చిన ఆటగాళ్లను నలుగురేసి చొప్పున రిటెన్షన్ పద్దతిలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు బీసీసీఐ అనుమతించింది.

2011 తర్వాత ఇప్పుడే
ఐపీఎల్‌లో ఈ సారి రెండు కొత్త జట్లు చేరడంతో టీంల సంఖ్య 10కి పెరిగింది. చివరగా ఐపీఎల్‌లో 2011లో 10 జట్లు ఆడాయి. అప్పుడు ఉన్న కొచ్చి టస్కర్స్ కేరళ, పుణే వారియర్స్ ఇండియా జట్లు ఆ తర్వాత టోర్నీ నుంచి తప్పుకున్నాయి. దీంతో 10 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ మళ్లీ 10 జట్లతో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications