|
కొత్త జట్ల రాకతో..
లీగ్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్‌కు చెందిన ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది. కొత్త జట్ల రాకతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. మెగా వేలం నిర్వహణ ఏర్పాట్లపై దృష్టిసారించింది.

బెట్టింగ్ సంస్థలతో లింక్..
వాస్తవానికి ఇప్పటికే మెగా వేలం కూడా పూర్తవ్వాల్సింది కానీ.. సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నెలకొంది. బెట్టింగ్ సంస్థలతో సీవీసి క్యాపిటల్స్‌ను బీసీసీఐ హోల్డ్‌లో పెట్టింది. దాంతో మెగా వేలం నిర్వహణ ఆలస్యమవుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారమైందని, సీవీసి క్యాపిటల్స్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇక మెగా వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను అంటిపెట్టుకున్నాయి. ఇక మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

రషీద్ ఖాన్ కూడా..
ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను తీసుకోవడంతో పాటు అతనికి సారథ్య బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అతనితో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్‌లను ఎంచుకుందంట. ఇక శ్రేయస్ అయ్యర్‌ను అహ్మదాబాద్ తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అతనే ఆ జట్టు కెప్టెన్ అని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అతని కోసం ప్రయత్నించినప్పటికీ వేలంలోకి వెళ్లేందుకే అతను ఇష్టపడినట్లు తెలుస్తోంది. అయ్యర్‌తో ముంబై ఇండియన్స్ లోపకాయిరి ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. రోహిత్ శర్మ వారసుడిగా అయ్యర్ తీర్చిదిద్దాలని ఆ టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోందంట. కేకేఆర్ సైతం కెప్టెన్సీ ఆప్షన్ కోసం అతనికి గాలం వేస్తుందంట.

హార్ధిక విఫలం..
గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వెన్ను గాయంతో జట్టుకు దూరమై సర్జరీ చేసుకున్న అతను రీఎంట్రీలో మునపటిలా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌కు పూర్తిగా దూరమైన అతను బ్యాట్స్‌మన్‌గా కూడా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అతని ఘోర వైఫల్యం టీమిండియా పరాజయానికి కారణమైంది. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పిస్తూ సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన హార్దిక్ పాండ్యా.. ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు.