Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: స‌న్‌రైజ‌ర్స్‌లోకి టీమిండియా సీనియ‌ర్ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్‌.. ధ‌ర ఎంతంటే?

IPL 2022 Mega Auction: Dinesh Karthik Joins Sunrisers Hyderabad Sold For Base Price 2 Crore
IPL 2022 Mega Auction : Dinesh Karthik Joins In SRH ? | Oneindia Telugu

ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏ ప్లేయ‌ర్‌ను ఏ జ‌ట్టు కొనుగోలు చేయ‌బోతుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక‌ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానులైతే తెగ కంగారు ప‌డిపోతున్నారు. గ‌త సీజ‌న్లో ఫేల‌వంగా ఆడిన త‌మ టీం ఈ సారైనా స‌త్తా చాటాల‌ని కోరుతున్నారు. ఇందు కోసం వేలంలో స‌రైన ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల‌ని ఆశిస్తున్నారు.

స‌న్‌రైజ‌ర్స్‌లోకి దినేష్ కార్తీక్‌

స‌న్‌రైజ‌ర్స్‌లోకి దినేష్ కార్తీక్‌

ఈ నేప‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ అభిమానుల‌ను సంతోష‌ప‌రించే వార్త ఒక్క‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అదేమిటంటే టీమిండియా వెట‌ర‌న్ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌బోతున్నాడు. ఈ మేర‌కు దినేష్ కార్తీక్‌ను కొనుగోలు చేయ‌డానికి స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం ప్రిపేర్ అయింద‌ట‌.

మంచి బ్యాట‌ర్‌, వికెట్ కీప‌ర్ అయినా 36 ఏళ్ల దినేష్ కార్తీక్ టీంలో ఉంటే జ‌ట్టుకు అద‌న‌పు బలం చేకూరుతుంద‌ని రైజ‌ర్స్ యాజమాన్యం భావిస్తోందని స‌మాచారం. దీనికి తోడు ఐపీఎల్‌లో కార్తీక్‌కు కావాల్సినంత అనుభం కూడా ఉంది.

అలాగే మంచి హార్ట్ హిట్ట‌ర్‌.. ప‌లు సంద‌ర్భాల్లో మంచి ఫినిష‌ర్‌గానూ నిలిచాడు. అంతేకాకుండా టీంలో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. దీంతో ఇలా అన్ని విధాలా ఉపయోగ‌ప‌డ‌తాడ‌నే ఉద్దేశ్యంతో వేలంలో దినేష్ కార్తీక్‌ను కొనుగోలు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం భావిస్తోంది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వ‌డ‌మే త‌న టార్గెట్ అని ఇటీవ‌ల కార్తీక్ కామెంట్స్ కూడా చేశాడు. దీంతో ఈ సారి కార్తీక్‌ క‌చ్చితంగా రాణిస్తాడ‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భావిస్తోంది.

రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

గ‌తేడాది కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున ఆడిన దినేష్ కార్తీక్‌కు ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. ఈ సారి ఆ జ‌ట్టు ఆండ్రూ ర‌స్సెల్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వెంక‌టేశ్ అయ్య‌ర్, సునీల్ న‌రైన్‌ను రిటైన్ చేసుకుంది. దీంతో ఈ సారి దినేష్ కార్తీక్ మెగా వేలంలో పాల్గొన‌నున్నాడు. గ‌తేడాది 17 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 22 సగటుతో 223 ప‌రుగులు చేశాడు. 131 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన కార్తీక్ అత్య‌ధిక స్కోర్ 40 ప‌రుగులు.

ధ‌ర ఎంతంటే?

ధ‌ర ఎంతంటే?

గ‌తేడాది దినేష్ కార్తీక్‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 7 కోట్ల 40 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న ఫామ్ దృష్యా ఈ సారి వేలంలో కార్తీక్ అంత పెద్ద మొత్తం ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే వేలంలో కార్తీక్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. దీంతో బేస్ ప్రైజ్ ధ‌ర‌కే కార్తీక్ అమ్ముడుపోయే అవ‌కాశాలున్నాయి. ఒక వేళ వేలంలో పోటీ ఏర్ప‌డిన 5 నుంచి 6 కోట్ల రూపాయ‌లు చెల్లించి దినేష్ కార్తీక్‌ను ద‌క్కించుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్‌మెంట్ ప‌ట్టుద‌ల‌గా ఉంద‌ని స‌మాచారం.

కార్తీక్ రికార్డులు

కార్తీక్ రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 213 మ్యాచ్‌లు ఆడిన 36 ఏళ్ల దినేష్ కార్తీక్ 25 స‌గ‌టుతో 4046 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 129గా ఉండగా.. అత్య‌ధిక స్కోర్ 97 ప‌రుగులు. 19 సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో 399 ఫోర్లు, 112 సిక్స్‌లు బాదాడు.

Story first published: Monday, January 31, 2022, 11:52 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+