Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction: క్వింట‌న్ డికాక్, శార్దూల్ ఠాకూర్‌పై ఆ 3 జ‌ట్ల క‌న్ను! ధ‌ర ఎంతంటే..

IPL 2022 Mega Auction: 3 Franchises want to buy Quinton De Kock and Shardul Thakur for Rs 10 crore

స‌రిగ్గా మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జ‌ర‌గ‌బోతుంది. ఈ నేప‌థ్యంలో వేలంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ప్రాంచైజీలు క‌స‌ర‌త్తులు ప్రారంభించాయి. ఇప్ప‌టికే వేలంలో ఎవ‌రెవ‌రిని కొనుగోలు చేయాల‌నే అంశంపై ప్రాంచైజీల‌న్నీ ఓ అంచనాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్‌, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్‌పై మూడు టీంలు క‌న్నేసాయ‌ని స‌మాచారం. వీరిద్ద‌రిని ఎంత ధ‌రైనా స‌రే వెచ్చించి వేలంలో కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయ‌ట‌.

గ‌త సీజ‌న్లో ఏ జ‌ట్ల కంటే

గ‌త సీజ‌న్లో ఏ జ‌ట్ల కంటే

గ‌త ఏడాది ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించిన క్వింట‌న్ డికాక్ స‌త్తా చాటాడు. ఆ సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 29 స‌గ‌టుతో 297 ప‌రుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్ అందుకోగా అత్య‌ధిక స్కోర్ 70 ప‌రుగులు. ఆ ఏడాది డికాక్‌కు ముంబై 2 కోట్ల 80 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించింది. మొత్తంగా ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడిన డికాక్ 31 స‌గ‌టుతో 2256 ప‌రుగులు చేశాడు.

 గ‌త సీజ‌న్లో శార్దూల్ ఠాకూర్‌

గ‌త సీజ‌న్లో శార్దూల్ ఠాకూర్‌

ఇక గ‌త సీజ‌న్లో శార్డూల్ ఠాకూర్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ఆ సీజ‌న్లో శార్దూల్‌కు చెన్నై 2 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. ఐపీఎల్‌లో మొత్తంగా 61 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 67 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3-19. ఓ సారి హాఫ్ సెంచ‌రీ కూడా చేశాడు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు బ్యాట్‌తోనూ రాణిస్తాడు. దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో ఆల్‌రౌండ‌ర్‌గా శార్దూల్ మంచి ఫాంలో ఉన్నాడు. అయితే డికాక్‌, శార్దూల్‌కు ఈ సారి త‌మ జ‌ట్ల రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్కేలేదు. దీంతో వీరిద్ద‌రు ఈ సారి వేలంలోకి రానున్నారు.

3 జ‌ట్ల క‌న్ను

3 జ‌ట్ల క‌న్ను

ఈ సారి మెగా వేలంలోకి రాబోతున్న శార్దూల్ ఠాకూర్, క్వింట‌న్ డికాక్‌పై మూడు జ‌ట్లు క‌న్నేశాయి. డికాక్ బ్యాట్‌తోనూ, కీప‌ర్‌గాను అద్బుతంగా రాణిస్తాడు. శార్దూల్‌ బ్యాట్, బాల్‌తో ఆల్‌రౌండ‌ర్‌గా అద‌ర‌గొడుతాడు. దీంతో వీరిద్ద‌రికి ఎంత ధ‌రైనా స‌రే వేలంలో వెచ్చించి కొనుగోలు చేయాల‌ని ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. ఈ సారి వేలంలో ముంబై ఇండియ‌న్స్‌ త‌మ ఆటగాడే అయినా డికాక్‌తోపాటు శార్దూల్ ఠాకూర్‌ను ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. వీరిద్ద‌రు జ‌ట్టులో ఉంటే మంచి బ్యాట‌ర్, వికెట్ కీప‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ లోటు తీరుతుంద‌ని, అందుకే మెగా వేలంలో ద‌క్కించుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి.

IPL 2022 Mega Auction : RCB Probable Squad
ధ‌ర ఎంతంటే?

ధ‌ర ఎంతంటే?

క్వింట‌న్ డికాక్, శార్దూల్ ఠాకూర్‌కు ఈ సారి వేలంలో ఉన్న స్టార్ డ‌మ్ దృష్యా ఎంత ధ‌ర అయినా పెట్ట‌డానికి ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వెనుకాడేలా క‌నిపించ‌డం లేదు. వీరిద్ద‌రు కూడా వేలంలో 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నారు. కానీ వీరుకున్న స్టార్ డ‌మ్ దృష్యా వేలంలో ఆ మూడు జ‌ట్లు తీవ్రంగా పోటీ ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ఇద్ద‌రు 8 కోట్ల రూపాయ‌ల నుంచి 12 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతార‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కాగా ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా మెగా వేలం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Story first published: Saturday, February 5, 2022, 19:01 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+