Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కెప్టెన్ అయ్యాక అత‌ను బ్యాట‌ర్‌గా రాణించ‌లేక‌పోతున్నాడు.. సెహ్వాగ్ వ్యాఖ్య‌లు

IPL 2022: Mayank Agarwal fails to become a batsman after becoming captain: Virender Sehwag

ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మ‌యాంక్ అగ‌ర్వాల్ బ్యాట‌ర్‌గా నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోతున్నాడ‌ని టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అంత‌కుముందు సీజ‌న్లో సాధార‌ణ ఆట‌గాడిగా రాణించాడని ఆయ‌న గుర్తు చేశాడు. కెప్టెన్ అయినంత మాత్రాన అత‌ను బ్యాటింగ్ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని, త‌నో ఓ జ‌ట్టుకు కెప్టెన్ అనే విష‌యం మ‌ర్చిపోయి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల‌ని సూచించాడు. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ‌గా ఆడ‌డం ద్వారా ప‌రుగులు చేయొచ్చని చెప్పాడు. అయితే టెస్టు ఫార్మాట్, వ‌న్డే ఫార్మాట్ల‌లో ఆరంభంలో నెమ్మ‌దిగా ఆడినప్ప‌టికీ, ఆ త‌ర్వాత ప‌రుగులు చేయ‌చ్చొని అన్నాడు. కానీ టీ20 క్రికెట్‌లో అలా కుదుర‌ద‌ని, ఆరంభం నుంచే దూకుడుగా ఆడాల‌ని లేక‌పోతే వెనుక‌బ‌డి పోతామ‌ని సెహ్వాగ్ చెప్పాడు. పంజాబ్ బౌలింగ్ యూనిట్ బ‌లంగా ఉంద‌న్న సెహ్వాగ్.. దానికి త‌గ్గట్టుగా బ్యాట‌ర్లు కూడా ఆరంభం నుంచే ధాటిగా ఆడాల‌ని అన్నాడు.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ స‌క్సెస్ అవుతున్న‌ప్ప‌టికీ బ్యాట‌ర్‌గా మాత్రం పెద‌గా రాణించ‌లేక‌పోతున్నాడు. ఇప్పటివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 32, 1, 4 ప‌రుగులు చేశాడు. మొత్తంగా 37 ప‌రుగులే చేశాడు. అదే స‌మ‌యంలో కెప్టెన్‌గా 3 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు రెండు విజ‌యాలు అందించాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 105 మ్యాచ్‌లాడిన మయాంక్ అగ‌ర్వాల్ 22 స‌గ‌టుతో 2177 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 11 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 106 ప‌రుగులుగా ఉంది.

IPL 2022: Mayank Agarwal fails to become a batsman after becoming captain: Virender Sehwag

పంజాబ్ కింగ్స్ పూర్తి జ‌ట్టు
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, షారుక్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, రాజ్ అంగద్ బావా, ప్రీరా ధావన్, రిషిక్ మన్కడ్, వైభవ్ అరోరా, రిటిక్ ఛటర్జీ, బల్తేజ్ ధండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్

Story first published: Saturday, April 9, 2022, 18:49 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+