IPL 2022: ధోనినే నంబర్ వన్.. చివరి ఓవర్లో 15+ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదిగో!

ఫోర్లు, సిక్సులు, వికెట్లతో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐపీఎల్ 2022 సిద్ధమైపోయింది. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద అని చెప్పుకోవాలి. ఇలాంటి ఐపీఎల్‌లో చివరి ఓవర్లు చాలా కీలకం. ఇక చివరిదైన 20వ ఓవర్ మరింత కీలకం. ఆ ఓవర్లో చేసే పరుగులే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో చివరి ఓవర్లో ఎక్కువ పరుగులు చేసే ఆటగాళ్లకు ప్రత్యేకమైన క్రేజ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరి ఓవర్లో 15కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల గురించి ఒక సారి తెలుసుకుందాం.

టాప్ ప్లేస్‌లో ధోని
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 15కు పైగా పరుగులను అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా మంచి మ్యాచ్ ఫినిషర్ అయిన ధోని రికార్డు స్థాయిలో 20వ ఓవర్లో 12 సార్లు 15కు పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 220 మ్యాచ్‌లాడిన ధోని 39 సగటుతో 4746 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలుండగా.. అత్యధిక స్కోర్ 84 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో ధోని 325 ఫోర్లు, 219 సిక్సులు బాదాడు. ఇక రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ 8 సార్లు చివరి ఓవర్లో 15+ స్కోర్ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరు 178 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 29 సగటుతో 3268 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 87 పరుగులుగా ఉంది. ఐపీఎల్‌లో పొలార్డ్ 65 వికెట్లు తీశాడు.
3, 4వ స్థానంలో వాళ్లే
ఇక చివరి ఓవర్లో 6 సార్లు 15+ స్కోర్లు సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ ఏబీ డివిల్లియర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లాడిన డివిల్లియర్స్ 39 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో డివిల్లియర్స్ 413 ఫోర్లు, 251 సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 5 సార్లు 15+ రన్స్ చేసిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లాడిన హార్దిక్ పాండ్యా 27 సగటుతో 1476 పరుగులు చేశాడు. 4 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా అత్యధిక స్కోర్ 91 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో 97 ఫోర్లు, 97 సిక్సులు బాదాడు. అలాగే బౌలర్‌గా 42 వికెట్లు కూడా తీశాడు.

రోహిత్ శర్మ స్థానం ఇదే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 5 సార్లు చివరి ఓవర్లో 15+ రన్స్ చేశాడు. ఇప్పటివరకు 213 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 31 సగటుతో 5611 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 491 ఫోర్లు, 227 సిక్సులు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications