Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌లోకి మ‌హేంద్ర‌సింగ్ ధోని!

IPL 2022: Mahendra singh Dhoni to invest in Sunrisers Hyderabad
IPL 2022 : MS Dhoni In Sunrisers Hyderabad ? | Oneindia Telugu

ఐపీఎల్ 2022లో మ‌హేంద్ర‌సింగ్ ధోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. అదేంటి ధోని స‌న్‌రైజ‌ర్స్‌తో క‌ల‌వ‌డ‌మేంటి? ఈ ఏడాదికి గాను ధోనిని ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటైన్ కూడా చేస‌కుంది క‌దా? మ‌ళ్లీ స‌న్‌రైజ‌ర్స్‌తో ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? దీనికి ఓ లెక్క ఉంది. ధోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న విష‌యం నిజ‌మే కానీ ఆట‌గాడిగా కాదు. ప‌రోక్షంగా స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ జ‌ట్టులో ధోని ఈ సీజ‌న్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. అదేలా అని ఆశ్య‌ర్య‌పోతున్నారా? అయితే ఈ విష‌యం తెలుసుకోండి.

ధోని పెట్టుబ‌డులు

ధోని పెట్టుబ‌డులు

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనికి 2015 నుంచి 'కార్స్ 24' అనే సంస్థలో పెట్టుబడులున్నాయి. ఈ సంస్థ‌కు ధోనినే స్వ‌యంగా బ్రాండ్ అంబాసిండ‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే కార్స్ 24 అనే సంస్థ‌నే ఈ ఏడాది ఐపీఎల్ 2022కు గాను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టైటిల్ స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కులు ద‌క్కించుకుంది. ఈ మేర‌కు ఇరు సంస్థ‌ల మ‌ధ్య ఇప్పటికే ఒప్పందం కూడా జ‌రిగిపోయింది. దీంతో ఇది వ‌ర‌కే ధోని పెట్టుబ‌డులు క‌ల్గి ఉన్న కార్స్ 24 స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాళ్ల జెర్సీలో ముందు భాగంలో ఉండ‌నుంది. దీంతో ధోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు ప్ర‌చారం చేసిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇలా ధోని ఆట‌గాడిగా కాకుండా టైటిల్ స్పాన్స్‌ర్‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యంలో పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నాడు.

కొత్త టైటిల్ స్పాన్స‌ర్

కొత్త టైటిల్ స్పాన్స‌ర్

కాగా గ‌తేడాది వ‌ర‌కు 'జెకె లక్ష్మీ' అనే సంస్థ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ ఏడాది ఆ సంస్థ త‌ప్పుకోవ‌డంతో కార్స్ 24 అనే సంస్థ కొత్త‌గా ఆ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. కాగా ఈ ఏడాది ముంబై ఇండియ‌న్స్ కూడా టైటిల్ స్పాన్సర్‌ను మార్చుకుంది. ఇది వ‌ర‌కు టైటిల్ స్పాన్స్‌ర్‌గా ఉన్న సామ్సంగ్‌తు బంధం వ‌దులుకుని స్లైస్‌కు ప్ర‌చార హ‌క్కులు క‌ల్పించింది. అలాగే చెన్నైసూప‌ర్ కింగ్స్ కూడా ఈ ఏడాది కొత్త‌గా టైటిల్ స్పాన్స‌ర్‌గా టీవీఎస్ యూరోగ్రిప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫిబ్ర‌వ‌రిలో మెగా వేలం

ఫిబ్ర‌వ‌రిలో మెగా వేలం

మ‌రోవైపు ఫిబ్ర‌వ‌రి 12, 13వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ద‌మ‌వుంది. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ వేలం కోసం అన్ని జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ క‌స‌రత్తు మొద‌లుపెట్టాయి. ఇందుకోసం ధోని చెన్నై ప్ర‌త్యేకంగా చెన్నై వెళ్లి మ‌రి సూప‌ర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో చ‌ర్చిస్తున్నాడు. కాగా ఈ ఏడాది కూడా చెన్నైసూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా మ‌హేంద్ర సింగ్ ధోనినే వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ న‌లుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేస‌కుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటెన్ష‌న్ జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా, మ‌హేంద్ర‌సింగ్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.

Story first published: Sunday, January 30, 2022, 17:50 [IST]
Other articles published on Jan 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+